బరువు తగ్గాలనుకునే వారు జీలకర్ర ను వాడడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. రోజూ జీలకర్ర తినడంకానీ లేదా దానిని మరిగించిన నీటిని తాగడం వల్ల కానీ బొడ్డు చుట్టూరా ఉన్న కొవ్వుతో పాటు ఇతర శరీర భాగాల్లో పేరుకున్న కొవ్వు కూడా తగ్గుతుంది. ఒక అధ్యయనంలో భాగంగా.. అధిక బరువు తో బాధపడుతున్న 80 మంది స్త్రీలను లను రెండు గ్రూపులు గా విభజించారు. అందులో ఒక బృందం వారు జీలకర్రను ఉపయోగించగా,మరో బృందం మాత్రం ఇతర ‘డైట్ కంట్రోల్’ పాటించారు.
చివరకు డైట్ కంట్రోల్ పాటించిన వారితో పోల్చితే.. జీలకర్రను తీసుకున్నవారు అత్యధికంగా బరువు తగ్గినట్లు పరిశోధనలో తెలిసింది . దీన్నిబట్టి.. జీలకర్ర ను తినడం లేదా తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగవడం తో పాటు కేలరీలను వేగంగా బర్న్ చేయచ్చని తెలిసింది. ఒక గ్లాసు నీటి లో ఒక పెద్ద చెమ్చాడు జీలకర్ర ను వేసి రాత్రంతా నానబెట్టాలి.
ఉదయాన్నే ఆ నీటిని మరిగించి న తర్వాత ఈ పానీయాన్ని వడకట్టి తాగాలి. మీకు మరింత రుచికరం గా కావాలంటే నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా 2 వారాల పాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో దీన్ని తాగి తాగితే వచ్చిన ఫలితం చూసి ఆశ్చర్య పోతారు. అయితే ఈ నీటిని తాగిన తరువాత ఒక గంటపాటు ఏమీ తినకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి.
ఒక టీస్పూన్ జీలకర్ర పొడిని ఒక టీస్పూన్ పెరుగుతో పాటు కలపండి. దీన్ని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాతతినాలి. ఇలా 15 రోజులు పాటు చేస్తే బరువు తగ్గుతారు .
వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.
శరీరం త్వరగా ముడతలు పడకుండా చేస్తుంది.
స్త్రీలల్లో అస్తవ్యస్థం గా ఉండే రుతుక్రమాన్ని తగ్గిస్తుంది.