మీ పిల్లలు ఏం చేస్తున్నారని తరచుగా గమనిస్తున్నారా?

మీ పిల్లలు ఏం చేస్తున్నారని తరచుగా గమనిస్తున్నారా?
Share

అలా కాదు ఆలా కాదుఇలా చెయ్యాలి ఇలా కాదు ఆలాఉండాలి అంటూ ఊరికే సలహాలు, సూచనలు ఇస్తున్నారా? అయితే జాగ్రత్త! మీ ప్రవర్తన ఇలాగే ఉంటే అది మీ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. వారి ఎదుగుదలకే అది ప్రమాదం. మీ అతి జాగ్రత్త పిల్లల చదువు, భావోద్వేగాలు, ప్రవర్తన పైన కూడా చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటున్నారు పరిశోధకులు.

మీ పిల్లలు ఏం చేస్తున్నారని తరచుగా గమనిస్తున్నారా?

ఇటువంటి ప్రవర్తనను “హెలికాప్టర్ పేరెంటింగ్ బిహేవియర్” అంటారు. అంటే పిల్లల్ని స్వేచ్ఛగా ఉండనివ్వకుండా మీరే వారికి డైరెక్షన్స్ ను ఇవ్వడం. కొందరు తల్లిదండ్రులు అలా ఆడుకో, ఇలా ఆడుకో, ఈ వస్తువుతో ఆడుకో, అది తప్పు, ఇది ఒప్పు అంటూ పిల్లల వెంటపడుతూ వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అమ్మానాన్నలు  ఇంట్లో ఇలా కఠినంగా ఉంటూ, అతిజాగ్రత్తతో పిల్లలను పెంచడం వల్ల పిల్లలు స్కూల్‌లో, సమాజంలో అడ్జెస్ట్ కాలేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది నిపుణులు హెచ్చరిస్తున్నారు..

రెండు, ఐదు, పదేళ్ల వయస్సుగల ఒక 422 మంది పిల్లలపై దాదాపు ఎనిమిదేళ్ల పాటు పరిశోధన చేసి ఆ ఫలితాలను డెవలప్‌మెంటల్ సైకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. చిన్న వయస్సులో తల్లిదండ్రులు పిల్లలని అతిగా నియంత్రిస్తూ, వారికి స్వేచ్ఛ లేకుండా చేస్తుంటే ఆ పిల్లలు ఐదేళ్లకు చేరుకునే సరికి భావోద్వేగాలను, ప్రవర్తనను నియంత్రించుకోవడంలో బలహీనంగా ఉంటారని ఈ పరిశోధనలో తేలింది. అదే ఐదేళ్ల వయస్సు పిల్లలను చూస్తే ఫలితాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.  అంటే రెండుమూడేళ్ల వయస్సులో ఉన్న పిల్లలను అతిగా నియంత్రిస్తే ఆ ప్రభావం వారి భవిష్యత్తుపై చాలా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Share

Related posts

తన జీవితంలో ఎవ్వరికీ చెప్పని నిజాలు బయటపెట్టిన కార్తీకదీపం వంటలక్క…

Naina

హీరోయిన్ గా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ పుష్ప లో ఐటెం సాంగ్ ఎలా చేస్తుందనుకున్నారు ..?

GRK

Sannajaji: ఒక కప్పు సన్నజాజి టీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..!?

bharani jella