Egg: కోడిగుడ్లు తినే వారు, తినని వారు ఎవరైనా సరే.. వాటిని నాన్ వెజ్ గా భావిస్తుంటారు. కానీ కొందరు గుడ్లను వెజ్ గానే భావిస్తుంటారు. అయితే ఈ సమస్య ఎప్పటినుండో ఉన్న దే… కానీ కొందరు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా వాటితో పలు రకాల వంటలు చేసుకుని లేదా ఉడకబెట్టుకుని, ఆమ్లెట్ వేసుకుని లాగించేస్తుంటారు.
అయితే మరి.. అసలు కోడిగుడ్లు ఏ జాతికి చెందినవో తెలుసుకుందాం. కోడిగుడ్లలో రెండు భాగాలు ఉంటాయి . ఒకటి పైన ఉండే తెల్లసొన, రెండోది లోపల ఉండే పచ్చ సొన. తెల్ల సొనలో ప్రోటీన్లు, నీరు ఉండి, అందులో జంతువులకు సంబంధించిన కణాలు ఉండవు. కనుక దాన్ని ప్యూర్ వెజ్అని అనవచ్చు. ఇక పచ్చ సొనలో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ప్రోటీన్లు తో పాటు ప్రత్యుత్పత్తి కణాలు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పచ్చ సొనను నాన్వెజ్ అని చెప్పవచ్చు.అయితే ఇక అసలు విషయానికి వస్తే.. కోడి గుడ్లను వెజ్ అనే చెప్పాలి.
ఎందుకంటే, వాటిల్లో జంతు కణాలు వంటివి ఏవి ఉండవు. పచ్చ సొనలో కణాలు ఉంటాయి కానీ, అవి ప్రత్యుత్పత్తి కి ఉపయోగపడేవి అయినాకూడా చాలా తక్కువగాఉంటాయి. మొత్తం గా చూస్తే కోడి గుడ్లను వెజ్ అనే చెప్పవచ్చు. మరి అవి కోడి నుంచి వస్తాయి కదా అనే సందేహం అయితే, మరి పాలు కూడా జంతువుల నుంచి వస్తాయి కదా.. మరి వాటినేమంటారు?? వెజ్ అనా, నాన్వెజ్ అనా..? ఏదీ చెప్పలేనట్టే గుడ్లను కూడా 100 శాతం వెజ్ అని చెప్పలేం. కానీ 99.99 శాతం వరకు అందులో ఉండేది మాత్రం వెజ్ పదార్థమే.. కనుక కోడిగుడ్లను వెజ్ గా గుర్తించి తీరవలిసిందే మరి.. ఇక ఆలోచించడం మాని హ్యాపీగా తినేయండి.