eggs: మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. ఈ బిజీ బిజీ లైఫ్ లో ఏది తింటున్నామో ఎంత తింటున్నామో కూడా మనకు గుర్తు ఉండటం లేదు. దానికి తోడు అన్నింటిలోను కల్తీ జరుగుతుంది. ఈ సమయంలో మంచి ఆహారం మనకు చాలా అవసరం. ఈ సమయంలో మంచి ఆహార పదార్థాలు దొరికితే వాటిని ఫ్రిజ్ లో పెట్టుకుని తినడం మనకు అలవాటు. ఇది కొన్నిసార్లు మంచిది కూడా. అయితే ఫ్రిజ్ లో కొన్ని ఆహార పదార్థాలను పెట్టకుడదని పలువురు నిపుణులు చెబుతున్నారు.
ఆ ఆహార పదార్థాల్లో ముఖ్యమైనవి గుడ్లు. మనకు గుడ్ల గురించి చాలా బాగా తెలుసు.. అవి మన శరీరానికి కావలసిని ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. అలాగే కల్తీ చేయలేని ఆహార పదార్థం కూడ ఇదే. అయితే కోడిగుడ్లను ఫ్రిజ్లో పెట్టకూడదు అని చాలా మంది చెబుతుంటారు. అలా ఫ్రిజ్ లో పెడితే ఏమైతుందని పలువురికి పలు ప్రశ్నలు రావడం సహజం. ఈ సందేహాలను సమాధానం మీకోసం..
గుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక రీసెర్చ్ ప్రకారం.. కోడిగుడ్లను ఫ్రిజ్లో పెడితే అవి తినడానికి పనికిరావని చెబుతోంది. ఒకవేళ అలా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని ఈ రీసెర్చ్ చెబుతోంది. గుడ్లను చల్లని ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తే.. వాటి పెచ్చుపై బ్యాక్టీరియా పెరుగుతుంది. ఒక్కోసారి ఇది గుడ్డులోనికి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. వాటిని బయటకు తీసి.. గది ఉష్ణోగ్రతలో ఉంచడం వలన అవి సంగ్రహణకు కారణమవుతున్నట్లు తేలింది. అందుకే వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని పరిశోధకులు తెలుపుతున్నారు. గుడ్లను ఎప్పుడు గది ఉష్ణోగ్రతలో మాత్రమే ఉంచాలని సూచిస్తున్నారు.