ఆమెరికాలో తుపాకీ కాల్పుల మోత ఆగడం లేదు. జనవరి నెలలోనే జరిగిన రెండు మూడు ఘటనల్లో 20 మందికి పైగా చనిపోయారు. ఆ ఘటనలు మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా మెక్సికోలో జరిగిన కాల్పులలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జెరెజ్ టౌన్ లోని ఓ నైట్ క్లబ్ లో సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దుండగులు పెద్ద సంఖ్యలో ఆయుధాలతో రెండు వాహనాల్లో ఎల్ వానాడిటో నైట్ క్లబ్ కు చేరుకుని అక్కడ జనాలపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారని పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో క్లబ్ ఉద్యోగులు, సంగీత కళాకారులు, వినియోగదారులు ఉన్నారని తెలిపారు.

వారం రోజుల క్రితం కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే ప్రాంతంలో రెండు చోట్ల దుండగులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఏడుగురు ఏడుగురు మృతి చెందారు. మరి కొందరికి గాయాలు అయ్యాయి. అయోవాలోని డెస్ మోయిన్స్లోని ఓ స్కూల్ లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందగా, ఓ ఉపాధ్యాయుడికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు రెండు రోజుల ముందు లాస్ ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. చైనీయుల లూనార్ న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటుండగా ఓ దుండగుడు కాల్పులకు తెగపడటంతో పది మంది మృతి చెందారు. ఆ ఘటనలు మరువకుముందే తాజాగా మెక్సికోలో కాల్పులు జరిగాయి.