Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Share

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ (BJP) నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రమాణ స్వీకారం చేశారు. ముంబాయి రాజ్ భవన్ కార్యాలయంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో సంఖ్యా బలం (106) బీజేపీకే ఎక్కువగా ఉన్నందున శివసేన రెబల్ ఎమ్మెల్యేల నేత ఏక్ నాథ్ శిందే మద్దతుతో దేవేంద్ర ఫడ్నవీస్ మరో సారి సీఎం బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. అయితే ఏక్ నాథ్ శిందే వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తొందనీ, శిందే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఫడ్నవీస్ చెప్పారు. ప్రభుత్వానికి తాము దూరంగా ఉంటామని సంచలన ప్రకటన చేశారు.

Eknath Shinde oath ceremony as Maharashtra CM

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలో మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు ఒప్పించారు. బీజేపీ కేంద్ర పెద్దల సూచనలతో ఏక్ నాథ్ శిండే మంత్రివర్గంలో భాగస్వామ్యానికి ఫడ్నవీస్ అంగీకరించి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బల నిరూపణపై నిన్న రాత్రి సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు ఉద్దవ్ ఠాక్రే. రాత్రి గవర్నర్ ను కలిసి ఉద్దవ్ రాజీమానా పత్రాన్ని అందించారు.

 

ఈ మధ్యాహ్నం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ శిందేలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

38 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago