NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Poll Violence: పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే ‘పిన్నెల్లి’ విధ్వంస కాండపై ఈసీ సీరియస్ .. అరెస్టుకు రంగం సిద్దం..!

Poll Violence: ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్ లలో ఇవీఎంలను ధ్వంసం చేశారు. అయితే ఆనాడు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. స్వయంగా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు బూత్ లలోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేయడం కలకలం రేపింది.

పోలింగ్ బూత్ లో పిన్నెల్లి దౌర్జన్యానికి సంబంధించిన సీసీ పుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఇందుకు బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిన్నెల్లిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సీఈవో, డీజీపీకి సీఈసీ ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఘటనకు సంబంధించి వెబ్ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను కేంద్ర ఎన్నికల అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నకల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో పుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించిన ఈసీ .. ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు కూడా ఈసీ నుండి ఆదేశాలు అందాయి. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఈసీ భావిస్తొంది.

అయితే.. సిట్ రంగంలోకి దిగిన తర్వాత పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేశారా .. లేక అంతకు ముందే నమోదు చేశారా అనే విషయం తెలియరాలేదు. సిట్ విచారణ ప్రారంభానికి ముందే గృహ నిర్బంధంలో ఉన్న పిన్నెల్లి హైదరాబాద్ వెళ్లిపోయారు. తనపై కేసు ఏమీ లేదని, తాను పారిపోయి రాలేదని, వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చినట్లుగా మీడియాకు నాడు వెల్లడించారు పిన్నెల్లి.

కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టునకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లినట్లుగా తెలుస్తొంది. మరో పక్క ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు అయిన నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

Revanth Reddy In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Related posts

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Chandrababu: ఆ అధికారులను కలిసేందుకు చంద్రబాబు విముఖత ..

sharma somaraju

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

ఏపీలో మంత్రి పదవులు దక్కేది వీళ్లకే(నా)..!

sharma somaraju