న్యూస్

Electric Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకుంటున్నారా .. ఇలా చేస్తే ‘ FREE ‘ గా కొనచ్చు !

Share

Electric Scooters : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అయితే తాజాగా ఒక పార్టీ నాయకుడు ఎలక్ట్రిక్ స్కూటర్లను సైతం ఫ్రీగా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆయన మీడియా సమావేశంలో కాలేజ్ స్టూడెంట్లందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరు? ఎక్కడ ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు పొందొచ్చు.

Electric Scooters : వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్

ఫిబ్రవరి 20వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Punjab assembly elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వరాల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) అనే ఒక పొలిటీషియన్ ఏకంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. కాలేజీ విద్యార్థులకు (college students) ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఫ్రీగా అందించే స్కూటర్లు అవే

లూధియానా ప్రాంతంలో తయారు చేస్తున్న ఈ-స్కూటర్లను కాలేజీ విద్యార్థులకు ఫ్రీగా అందిస్తామని నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివరించారు. అబ్బాయిలకు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను తక్కువ ధరకే అందజేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. స్కూటర్ లోన్ (scooter loan) తక్కువ వడ్డీ అందజేస్తామని కూడా ఆయన తెలియజేశారు. దీంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్కూటర్లను ఫ్రీగా అందించడం మాత్రమే కాదు మరిన్ని బంపర్ ఆఫర్లు కూడా ఆయన ప్రకటించారు. పంజాబ్ ఆర్థికాభివృద్ధి మేరకు ‘పంజాబ్ మోడల్​ (Punjab model)’ను మెరుగు పరుస్తామని చెప్పారు. లూధియానా నగరాన్ని ఇండస్ట్రియల్ హబ్ (Industrial hub)గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.


Share

Related posts

Rajamouli: బాహుబలి కి 100 రెట్ల సినిమా తీస్తోన్న రాజమౌళి..నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే..!

GRK

vaishnav tej – Nagarjuna :అక్కినేని వారి బ్యానర్ లో మెగా మేనల్లుడు..!!

bharani jella

శాంతి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి..!!

Vissu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar