NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ ను కొనుగోలు చేస్తానంటూ ప్రకటించిన మస్క్..కొద్దిసేపటికే బిగ్ ట్విస్ట్

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేయాలన్న డీల్ నుండి అర్ధాంతరంగా వైదొలిగి న్యాయ పోరాటంలో చిక్కకున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ .. నేడు సోషల్ మీడియా వేదికగా ట్విస్ట్ ట్వీట్ లు చేశారు. ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ ‘మాంచెస్టర్ యునైటెడ్’ ను కొనుగోలు చేస్తానంటూ ప్రకటించి మరోసారి గందరగోళాన్ని సృష్టించారు. అయితే ఈ డీల్ కు సంబంధించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. “నిజం చెప్పాలంటే నేను రిపబ్లిక్ పార్టీ ఎడమ భాగాన్ని, డెమోక్రాటిక్ పార్టీ కుడి భాగాన్ని సపోర్టు చేస్తా” అని ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్ ఆ వెంటనే “నేను మాంచెస్టర్ యూనైటెడ్ ను కూడా కొంటున్నా, మీ అందరికీ స్వాగతం” అని మరో ట్వీట్ చేశారు.

 

అయితే ఇలాంటి ట్వీట్ల విషయంలో మస్క్ వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియనప్పటికీ ఈ వార్త ఫుట్ బాల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ట్విట్టర్ కొనుగోలు అంశంలో సంచలనాలు సృష్టించిన చరిత్ర మస్క్ కు ఉండటంతో వెంటనే దీనిని నమ్మలేని పరిస్థితి విశ్లేషకుల్లో నెలకొంది. మస్క్ ట్వీట్ ల అనంతరం మాంచెస్టర్ యునైటెడ్ యజమాని అయిన గ్లోజెర్స్ ఫ్యామిలీని, మస్క్ ను వార్తా సంస్థలు సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు. అయితే కొద్ది గంటల వ్యవధిలోనే మస్క్ మళ్లీ స్పందిస్తూ .. అబ్బే లేదు.. ట్విట్టర్ లో అత్యధిక కాలం ఉండే జోక్ ఇది.. నేను ఎటువంటి క్రీడా జట్టును కొనుగోలు చేయడం లేదు అని వివరణ ఇచ్చారు.

గ్లోజెర్స్ ఫ్యామిలీ గత ఏడాది నుండి ఈ పుట్ బాల్ జట్టును అమ్మాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ నాలుగు బిలియన్ పౌండ్ల కంటే అధిక మొత్తంలో ఆఫర్ వస్తేనే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ ఫుట్ బాల్ జట్టు ఏకంగా 20సార్లు ఇంగ్లాండ్ ఛాంపియన్ గా నిలిచి రికార్డు సృష్టించింది. మూడు సార్లు యూరోపియన్ కప్ ను గెలుచుకుంది. ఈ క్లబ్ మార్కెట్ విలువ మంగళవారం నాటికి 2.08 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఇటీవల క్లబ్ ఆట తీరు కొంత నిరాశజనకంగా ఉండటంతో గ్లోజెర్స్ కు వ్యతిరేకంగా అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు ఎలాన్ మస్క్ ట్విట్టర్ కు బదులు ఈ క్లబ్ కొనాలని కోరారు. ఈ నేపథ్యంలోనే మస్క్ క్లబ్ కొనుగోలు చేస్తానంటూ ట్వీట్ చేయడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేసే లోపుగానే జోక్ చేశానంటూ మస్క్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!