Elon Musk: ఆమెరికా రాజకీయాల గురించి తరచు స్పందించే అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా డెమొక్రటిక్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. తాను గతంలో డెమొక్రటిక్ పార్టీకి ఓటు వేశాననీ, ఇప్పుడు ఎంత మాత్రం వారికి మద్దతు ఇవ్వననీ, ఇక తాను రిపబ్లికన్ పార్టీకే ఓటు వేస్తానని ఎలాన్ మస్క్ బహిరంగంగా ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
“గతంలో నేను డెమొక్రటిక్ పార్టీకి ఓటు వేశాను, ఎందుకంటే ఆ పార్టీ చాలా మట్టుకు దయనీయమైనదిగా కనిపించింది కానీ క్రమంగా విభజనకారిగా ద్వేషకారిగా ఆ పార్టీ మారిపోయింది. ఇంకెంత మాత్రం ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోను. రిపబ్లికన్ పార్టీకే ఓటు వేస్తాను” అని ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇలా రాజకీయ పార్టీకి తన బహిరంగ మద్దతు ప్రకటించిన మస్క్.. ఇక తనకు రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను పేర్కొన్నారు. ఇక చూడండి నాకు వ్యతిరేకంగా వాళ్లు చేసే చెత్త ప్రచారం చేస్తారనీ, రాబోయే రోజుల్లో రాజకీయ దాడులు నాపై నాటకీయంగా పెరుగుతాయి అని మస్క్ పేర్కొనారు.
బిలియనీర్లపై పన్ను విధించే ప్రతిపాదనతో పాటు దేశీయంగా తయారయ్యే ఎలక్రిక్ వాహనాలపై మరిన్ని పన్నురాయితీలు ఇవ్వాలన్న బైడెన్ ప్రభుత్వ ప్రతిపాదనలను ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలోనూ డెమొక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా మస్క్ ట్వీట్ చేశారు.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…