Tesla CEO: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గురించి ఇంట్రో అవసరం లేదు. కార్పొరేట్ ప్రపంచంలో ఎదురులేని మనిషి అతడు. మస్క్ ఏం చేసినా, సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ అయిపోతుంది. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా అతడు ఓ ట్వీట్ చేసి పారేశారు. అయితే మస్క్ దీన్ని సీరియస్గా చెప్పారా లేదంటే ఫాలోవర్ల అభిప్రాయం కోసమో లేక ఫాలోయింగ్ కోసమో తెలియట్లేదని పలువురు కార్పొరేట్ నిపుణులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తన సంస్థ అయినటువంటి టెస్లా షేర్లను వరుసగా అమ్ముతూ వస్తున్న మస్క్ చెప్పిన ఈ విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ అయన ఏం చెప్పారు?
ఈ రకంగా ఆయన ట్వీట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. బహుశ, ఆ విషయం చెబితే మీరు కూడా నమ్మరు. అదేమిటంటే, తాను పూర్తిగా తన బాధ్యతల నుండి తొలగిపోతానని.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన అనేక మంది కార్పొరేట్ దిగ్గజాలు దానికి ధీటుగా రిప్లయ్ ఇస్తున్నారు. కారణం ఏమిటని మస్క్ ను ప్రశ్నిస్తున్నారు. కొందరు దీన్ని నమ్మమంటూ మెసేజ్ చేస్తుంటే, ఇంకొందరు ఇది నిజమే అంటూ బల్ల గుద్ది చెబుతున్నారు.
పూర్తి బాధ్యతలనుండి మస్క్ వైదొలగనున్నారా?
ఈ విషయం మాత్రం ఆయన పూర్తిగా నిర్దారించలేదనే చెప్పాలి. ఎందుకంటే, డైరెక్ట్ గా కాకుండా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలని అనుకుంటున్నానని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. “ఫుల్ టైమ్ ఇన్ఫ్లుయెన్సర్ గా మారేందుకు ప్రస్తుతం నేను వహిస్తున్న బాధ్యతలను పక్కనపెట్టేస్తున్న” అంటూ మస్క్ ట్వీట్ చేయడం కొసమెరుపు. ఇకపోతే మస్క్ ఏది చేసినా సోషల్ మీడియాలో సెన్షేషన్ అవుతోంది. ఇటీవల ఎలాన్ మస్క్ హెయిర్ కట్ గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడిచింది. ఇక వేచి చూడాలి, ఇది నిజమో అబద్ధమో!