జబర్దస్త్ వేదికగా ఎంతోమంది కమెడియన్లు పాపులర్ అయ్యారు. కొన్నేళ్ళు సినిమాలలో చక్రం తిప్పిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ దానిని నమ్ముకొని జీవితాలు నిలబెట్టుకున్న వారు చాలామంది. తాజాగా బుల్లితెర ప్రేక్షకులను బాగా నవ్విస్తున్న జబర్దస్త్ కంటెస్టెంట్ ఇమ్మన్యుయల్ గురించి అందరికీ తెలిసిందే. ముందు చిన్న సైజు ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టి క్రమంగా స్టార్ ఆర్టిస్టుగా మారాడు.
ఒకపక్క తను చేసే కామెడీకి మరో అందం తోడయింది. కామెడీ షో తన అందంతో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆ అందం పేరు వర్ష అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్ లో నటించిన ఈ సుందరి జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయిపోయిం. జబర్దస్త్ లేడీ గెటప్ లను చూసి విసిగిపోయిన జనాలకు నిజంగానే అమ్మాయిలను తెచ్చి స్కిట్ లు చేస్తే ఎలా ఉంటుందని ఐడియా బాగా వర్కౌట్ అయింది.
గతంలో సత్య అనే అమ్మాయిని చమ్మక్ చంద్ర తీసుకొని వచ్చి మంచి హిట్లు కొట్టాడు. హైపర్ ఆది స్కిట్ లో వర్ష బాగా క్లిక్ అయింది. తర్వాత వెంకీ మంకీస్ టీం లో ఇమ్మన్యుయల్ జోడీగా వర్ష స్కిట్లు చేస్తోంది. ఇమాన్యుల్ ఆమెతో కలిపే పులిహోర భారీ హిట్ అని చెప్పాలి. తాజాగా ఇమాన్యుల్, వర్ష సాయికుమార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న వావ్-3 లో గెస్ట్ లు గా ఎంట్రీ ఇచ్చారు. ఇక అందులో వారిద్దరు కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
జబర్దస్త్ గురించి చెప్పమంటూ వర్షను సాయికుమార్ అడిగినప్పుడు ఇమాన్యుల్ నా గురించి నువ్వు ఏమీ చెప్పట్లేదు అని ఆమెపై కౌంటర్ వేసాడు. ప్రేమిస్తున్నాను అని చెప్పమని అంటున్నాడు సార్ అని వర్ష సాయి కుమార్ తో ఇమాన్యుల్ గురించి కంప్లైంట్ చేసింది. ఇదే సందర్భంలో ఇమాన్యుల్, వర్ష టైటానిక్ పోజ్ చేశారు. అలాగే మీ ఇంట్లో తెలిస్తే ఏమీ అనరా అని సాయి కుమార్ వర్ష ని అంటే…. అందుకే మాన్యువల్ లేదు సార్ మా అత్తకి నా గురించి తెలుసు అని కౌంటర్ వేసాడు. మొత్తానికి ఇమాన్యుల్ కి వర్ష పై ప్రేమ బయటపడిందని అందరూ అనుకుంటున్నారు.