గ్లామరస్ హీరోయిన్ అనుష్క శెట్టి సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అందం, అభినయం కలబోసిన రూపం అనుష్కది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. అలానే లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి పెట్టింది పేరుగా నిలించింది. అరుంధతి, భాగామతి, బాహుబలి లాంటి సినిమాలు అనుష్కను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి.
సినీ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు
ఇక నిన్నటికే అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 17 ఏళ్ల జర్నీలో అనుష్క ఎన్నో విజయాలను అందుకుంది. అలానే ఎన్నో పరాజయాలను చవి చూసింది. అంతేకాకుండా మరెన్నో విమర్శలను ఎదుర్కొంది. వాటన్నిటినీ దాటుకొని ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది. ఈ ముద్దుగుమ్మ సినిమా చేయక ఇప్పటికే రెండేళ్లు దాటింది. అయినా కూడా ప్రేక్షకుల్లో ఆమె మీద ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు.
ఎమోషనల్ పోస్ట్
ప్రస్తుతం అనుష్క యూవీ క్రియేషన్స్‌లో నవీన్ పోలిశెట్టి సరసన ఒక సినిమా చేస్తుంది. ఆ ప్రొడక్షజ్ కంపెనీ అనుష్క 17 ఏళ్ల జర్నీని ఘనంగా చూపించింది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ అనుష్క తన అభిమానులందరికీ థాంక్యూ చెప్పింది. “17 ఏళ్లుగా నాకు అండగా నిలిచి, నన్ను ఎంతగానో అభిమానిస్తున్న చిత్ర పరిశ్రమకు, అభిమానులకు, కుటుంబసభ్యులకు నా ధన్యవాదాలు. మీ అంతులేని ప్రేమను చూసి నేనెప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటాను. అలాంటి కల్మషం లేని ప్రేమను నాపై చూపిస్తునందుకు హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్నాను” అంటూ మూవీ సెట్ లో కేక్ కట్ చేసిన ఫోటోలను అనుష్క సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనుష్క షేర్ చేసిన ఫొటోస్ లో ఎవరి మొహం సరిగ్గా కనిపించకపోవడంతో అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తునే 17 ఏళ్ల జర్నీని విజవంతంగా పూర్తి చేసుకునేందుకు అనుష్కకు శుభాకాంక్షలు తెలియజేసారు.