జాతీయం ట్రెండింగ్ న్యూస్

Enforcement Directorate: ఆమ్ వే ఇండియా సంస్థకు ఈడీ బిగ్ షాక్.. 757 కోట్ల స్థిర చరాస్తులు, బ్యాంక్ డిపాజిట్లు జప్తు

Share

Enforcement Directorate: ప్రముఖ మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ సంస్థ ఆమ్ వే ఇండియాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. సదరు సంస్థపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు..రూ.757 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసుకున్నారు. ఆమ్ వే ఇండియా సంస్థ నిబంధనలకు విరుద్దంగా చెయిన్ లింక్ మార్కెటింగ్ ద్వారా స్కామ్ కు పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీ ఉత్పత్తులు బహిరంగ మార్కెట్ లో లభించే ప్రముఖ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. ఈ పిర్యాదులపై దర్యాప్తు చేసిన ఈడీ అధికారులు సదరు కంపెనీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు.

Enforcement Directorate attaches amway indias assets
Enforcement Directorate attaches amway indias assets

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో సంస్థకు ఉన్న భూమి, ఫ్యాక్టరీ భవనంతో పాటు యంత్రాలు, మిషనరీ లను అదికారులు సీజ్ చేశారు. రూ.411.38 కోట్ల విలువైన స్థిర చరాస్తులతో పాటు 36 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.345.94 కోట్ల నగదును అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది.


Share

Related posts

అబ్బో రౌడీ రేంజ్ బాగా పెరిగిపోయిందా?

sowmya

ఏడు కొండల వెంకన్నను దర్శించుకోవచ్చు

somaraju sharma

KCR: భ‌లే టైంలో కేసీఆర్ కు గుడ్ న్యూస్‌….

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar