చిదంబరం‌ అరెస్టు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బుధవారం అరెస్టు చేసింది. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం అనుమతి ఇవ్వడంతో బుధవారం ఇడి అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.

నగదు అక్రమ చలామణి అంశంపై చిదంబరాన్ని ప్రశ్నించేందుకు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ ఇడికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు  జారీ చేసిన నేపథ్యంలో

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న చిదంబరాన్ని బుధవారం ముగ్గురు ఇడి అధికారులు దాదాపు గంట సేపు విచారించారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 55 రోజుల సిబిఐ జ్యూడీషియల్ కస్టడీ తర్వాత చిదంబరాన్ని ఇడి అరెస్టు చేసింది.