NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Pawan kalyan కు జ్ఞానోదయం అయ్యిందా! కాపుల నాయకత్వం ఎత్తుకుంటారా?

Pawan kalyan  ఆవిర్భావ సభలో చెప్పిన మాట ఒకటి గుర్తుందా?? కాపు నాయకులు తనకు మద్దతు ఇవ్వము అని చెబుతున్నారట! నేను అడిగానా వాళ్ళని?? బాబు బాబు నాకు నా పార్టీకి మద్దతు ఇవ్వండి అని… ఆ సమయంలోనే ఆ మాట పెను సంచలనం అయ్యింది. కాపుల మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తారు? వారి మద్దతు అవసరం లేకుండానే ఎలా రాజకీయాలు చేస్తారు అంటూ అప్పట్లోనే పెను దుమరం రేగింది. దాని తర్వాత కాపులను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దగ్గరికి తీసింది లేదు.. కాపు ఉద్యమంలో ఆయన పాత్ర పోషించింది లేదు. 2019 ఎన్నికల్లో స్వతహాగా ఆయన నేను రెల్లి కులస్థుడిని… అని ప్రకటించుకున్న అప్పుడు సైతం కాపు నాయకుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఒక కాపు గా పుట్టి రెడ్డి కులస్తులు గా ఎలా చెప్పుకుంటారని.. కావలసిన వాళ్ళకి ఆయన దూరం పెడుతున్నారని ఆయనను పలువురు పలు మాటలు అన్న దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. 2014లో పార్టీ ప్రకటించిన దగ్గర నుంచి రెండు ఎన్నికలను ఎదుర్కొన్న జనసేన పార్టీ కాపులను ప్రత్యక్షంగా మద్దతు కోరకుండానే ఎన్నికలకు వెళ్లింది. ఆ ఫలితాలు అత్యంత చేదుగా ఉండటంతోపాటు పార్టీ నానాటికీ దారుణంగా తయారు అవుతున్న డంతో ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గమైన కాపులు వైపు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమాన్ని ఆయన తనదైన పంథాలో ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని పక్కన పెట్టినట్లు ఇటీవల ప్రకటించడంతో ఆ ఖాళీని పవన్ కళ్యాణ్ భర్తీ చేసే విధంగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే కాపు సంక్షేమ నాయకులతో బేటీ అవుతున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పడం ఇటు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

enlightened-pawan-kalyan-will-kapula-take-the-lead
enlightened pawan kalyan will kapula take the lead

BJP గాలం… జనసేన తాళం! Pawan kalyan

BJP ఇప్పటికే కాపులను తమ వైపు తిప్పుకునేందుకు నానా రకాల ప్రయత్నాలను ఢిల్లీ స్థాయిలో ప్రారంభించింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ను ప్రత్యేకంగా కలిసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ ముందు పెద్ద విషయం ఉంచామని, దానిని ఆయన నెరవేరుస్తారా నమ్మకం తమకు ఉందని చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఢిల్లీ స్థాయిలో బిజెపి నాయకుల ప్రోద్బలంతోనే తాను ముద్రగడ ను కలిసినట్లు కూడా చెప్పడం విశేషం. బిజెపి ఈ కొత్త మార్గం ద్వారా కాపులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ముందుకు సాగుతుంటే, ఆ పార్టీలో బలమైన క్రౌడ్ పుల్లర్ ఎవరూ లేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్. బలంగా మాట్లాడి నాయకులు నిలబడే నాయకులు బీజేపీ కు తక్కువగా ఉండడం, కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే స్థాయి వ్యక్తులు కొదవ ఉండడం బి.జె.పి ముందుకు వెళ్లలేక పోవడానికి ప్రధాన కారణం. కాపులకు బీజేపీ దగ్గర అవడంతో పాటు.. రాష్ట్రంలో అత్యధికంగా దళితులు తర్వాత జనాభా ఉన్నా కాపుల ఓట్లు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సంఘటితం చేస్తేనే వైఎస్సార్సీపీ నిలువరించడం సాధ్యం అనే అంచనాకు ఇప్పటికే బిజెపి వచ్చింది. కాపుల ఓట్లన్నీ గంపగుత్తగా బిజెపి జనసేన కూటమికి పడితేనే వైఎస్ఆర్సిపి కు ప్రధానంగా పోటీ ఇవ్వగలమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. దీంతోనే ఇప్పటికే కాపులకు గాలం వేసే పనిలో బిజెపి నాయకులు ఉంటే ఇప్పుడు జనసేనని పవన్కళ్యాణ్ సైతం కాపులను ఆకట్టుకునేందుకు వారితో సమావేశం అవ్వడం, మొదటిసారి వారి డిమాండ్లు వినేందుకు జనసేనాని సిద్ధపడడం కాపులను దగ్గరికి చేరుకోవడంలో భాగమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

enlightened-pawan-kalyan-will-kapula-take-the-lead
enlightened pawan kalyan will kapula take the lead

కాపులు నమ్ముతారా?

జనసేన పార్టీ పెట్టిన తర్వాత కాపులను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కలిసింది లేదు. ఇప్పుడు ఏకంగా కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులతో నే జనసేన అధ్యక్షుడు మాట్లాడి కాపు రిజర్వేషన్ల మీద, రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ల అమలు మీద చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలోనే రాజకీయ చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమి కి కాపులంతా ఐక్యంగా మద్దతిస్తే రిజర్వేషన్లు విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవచ్చని… ఎవరిని అడగకుండానే తమ రిజర్వేషన్లు న్యాయపరంగా తామే రూపొందించుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ సూచించే అవకాశాలు లేకపోలేదు. కాపుల రిజర్వేషన్ మీద జనసేన బిజెపి ఉమ్మడి ఎజెండాను కాపు సంక్షేమ నాయకులకు చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. రిజర్వేషన్లు ఇతర విషయాల మీద చర్చించి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తమకు మద్దతు పలికితే… ఎలా పాలన ఉంటుంది అనేదానిమీద పవన్ కళ్యాణ్ కాపు ప్రతినిధులకు స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. మరి అత్యంత త్వరలో కాపు ప్రతినిధులను కలవబోతున్న పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీలు వారి నుంచి పొందుతారు? భవిష్యత్తులో రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది అన్నది కీలకంగా మారింది.

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju