సందడిగా రాష్ట్రపతి ఎట్ హోమ్

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

సికిందరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి విడిది నివాసంతో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఏటా శీతాకాలం భారత రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నివాసానికి విడిదికి రావడం ఆనవాయితీ.  ఆదివారం (డిసెంబర్ 23) సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర, రాష్ట్ర ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సాదరంగా స్వాగతం పలికి అతిథ్యం ఇచ్చారు. ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ ఆలీ, శాసనసభ మాజీ స్పీకర్ మధుసూధనాచారి, ప్రభుత్వ కార్యదర్శి ఎస్ కె జోషి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కె కేశవరావు, టీఎస్ మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, పలువురు టీఎస్ శాసనసభ్యులు, ఎంఎల్ సీలు, టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్లొన్నారు.

ఎట్ హోమ్ దృశ్యమాలిక :