బిగ్ బాస్ 4: వివాదాస్పద సింగర్ హౌస్ లోకి ఎంట్రీ..!!

ఇండియాలో బిగ్ బాస్ షో ఎంతో ఆదరణ దక్కించుకుంది. హిందీ లో మొదట ప్రసారమయ్యే ఇప్పటికే పదికి పైగా సీజన్లు ముగియడం జరిగింది. దక్షిణాది లో కూడా ఈ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో ప్రస్తుతం నాలుగో సీజన్ జరుగుతుంది. రెండు భాషల్లో కూడా షోకి మంచి ఆదరణ ప్రస్తుతం ఉంది. ఒకపక్క ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా టిఆర్పి రేటింగ్ ల విషయంలో తగ్గటం లేదు.

Singer Suchithra makes shocking allegations again - Tamil News -  IndiaGlitz.comఇదిలా ఉండగా తమిళ్ సీజన్లో 16 మంది పాల్గొనడం జరిగింది. ఇప్పటికే బీజే అర్చన చందొక్ వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం మరో వివాదాస్పద సింగర్ ఆర్ జే సుచిత్ర కూడా.. త్వరలో తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్జే సుచిత్ర తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో పాటలు పాడారు.

 

కాగా మూడు సంవత్సరాల క్రితం “సుచి లీక్స్” పేరుతో పలువురు నటీనటుల ప్రైవేట్ ఫొటోలు వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి సుచిత్ర వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో సుచిత్ర భర్త కమెడియన్ కార్తీక్ ఆమె నుంచి విడాకులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం బయట ప్రైవేట్ ఆల్బమ్ లు చేస్తోంది. పరిస్థితి ఇలా ఉండగా త్వరలోనే ఈ వివాదాస్పద సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నట్లు వార్త రావడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.