Etela Rajendar Comments: కేసీఆర్ పై ఈటెల తీవ్ర వ్యాఖ్యలు..! వారి సంగతి చూస్తా అంటూ ఘాటుగా..!!

Etela Rajendar Comments: about CM KCR
Share

Etela Rajendar Comments: తెలంగాణ మంత్రివర్గం నుండి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో బిజీ అయిపోయారు. గంటకో ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారు. పనిలో పనిగా కేసీఆర్, కేటీఆర్ తీరుపైనా.. టీఆరెస్ పార్టీపైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఈరోజు ఈరోజు మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్‌లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. కేసీఆర్ కి అహంకారమని.. మంత్రులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని ఆయన ఘాటుగా మాట్లాడడం కొంత సంచలనం కలిగిస్తుంది. “ప్రగతిభవన్‌లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉంది. ఆయన ఆరోగ్యం బాగా లేదని, వేరే పని మీద ఆయనను కలవడానికి మంత్రులు వెళితే అనుమతించలేదు. ఈ అనుభవం నాతో పాటూ అనేక మంది మంత్రులకు ఎదురయింది. ఇంత అహంకారమా? ఇవే విషయానల్ను మంత్రి గంగుల కమలాకర్‌ కూడా తనతో వ్యాఖ్యానించారని ఈటల అన్నారు.

Etela Rajendar Comments: about CM KCR
Etela Rajendar Comments: about CM KCR

Etela Rajendar Comments: పిలిపించి మాట్లాడాల్సింది.. నేనే రాజీనామా చేసేవాడ్ని..!!

“నా వ్యవహారం నచ్చకపోతే పిలిపించి అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నవారంతా నా సహచరులే. వాళ్లకు నా గతి పడుతుంది. ఎవరెవర్ని తొలగిస్తున్నారో అందరికీ తెలుసు. అందుకే భజనలు చేస్తున్నారు. నేను ఏనాడూ ముఖ్యమంత్రి కావాలనుకోలేదు. కేసీఆర్‌ తర్వాత ఆయన కుమారుడే సీఎం కావాలని అన్నాను’’ అని ఆయన చెప్పారు. ఇక తన భవిష్యత్తు ప్రణాళికలపై ఇంకా చర్చించలేదని.. రెండు రోజుల్లో తన నియోజకవర్గ ముఖ్య అనుచరులు, అభిమానులతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఆయన బీజేపీలోకి వెళ్తారని.. కొత్త పార్టీ పెడతారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి..!


Share

Related posts

గోరింటాకు వలన ఏమి జరుగుతుందో తెలుసా??

siddhu

బంగారపు పట్టిలు కాళ్ళకు పెట్టుకో కూడదు అనడానికి కారణం ఇదే …  

Kumar

800 ఏళ్ల కిందట ఒక అద్బుతం జరిగింది..! మళ్ళీ ఈనెల 21న రానుంది..! మిస్సవ్వద్దు సుమీ..!!

Vissu