Etela Rajendar: తెలంగాణలో అతి పెద్ద భూస్కామ్ ఇదేనా..! ఈటెలతో సహా ఇంకా పెద్దల పాత్ర..!?

Share

Etela Rajendar: భూకబ్జా ఆరోపణపై మంత్రి ఈటెల రాజేందర్ ను కేసిఆర్ సర్కార్ మంత్రివర్గం నుండి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో దేవరయాంజాల్ సీతారామాలయం భూముల వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు. ఈ భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయి. అసలు ఈ భూముల సంగతి ఏమిటి, ఈ భూముల కబ్జాల వెనుక ఎంత మంది పెద్దలు ఉన్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే దేవరయాంజాల్ భూముల్లో మంత్రులు కేటిఆర్, మల్లారెడ్డిలకూ భూములు ఉన్నాయనీ, ఈ భూముల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీీీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో అసలు దేవరయాంజాల్ భూముల కథ ఏమిటి అన్న దానిపై ప్రతి ఒక్కరికీ ఆసక్తి పెరిగింది.

Etela Rajender devaryamjal temple land scam
Etela Rajender devaryamjal temple land scam

ఈ భూముల గురించి విషయం ఏమిటంటే… కరీంనగర్ జాతీయ రహదారిలో హకీంపేట విమానాశ్రయం హద్దు గోడ తరువాత ఉన్న ప్రాంతమే దేవరియాంజాల్, ఇది గతంలో మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల పరిధిలోని గ్రామం కాగా ఇప్పుడు పక్కనే ఉన్న తూముకుంట గ్రామ మునిసిపాలిటీగా ఏర్పాటు అయిన తరువాత ఈ గ్రామంలో అందులో విలీనం అయ్యింది. ఇక్కడి సీతారామ ఆలయానికి సుమారు 1500 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. 1944 సెత్వార్ ప్రకారం దేవరయాంజాల్ భూములన్ని ఆలయం పేరుపైనే ఉన్నాయి. అయితే 1954 -55 మధ్య ఖాస్రా పహాణీ లో సీతారామ స్వామి దేవస్థానం పేరు స్థానంలో ప్రైవేటు వ్యక్తుల పేర్లు రాసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆలయానికి చాలా తక్కువ సంఖ్యలో భూములు ఉన్నాయి.

Etela Rajender devaryamjal temple land scam
Etela Rajender devaryamjal temple land scam
Etela Rajender devaryamjal temple land scam
Etela Rajender devaryamjal temple land scam

ఆ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తుల క్రయ విక్రయాల ద్వారా వందల ఎకరాలు చేతులు మారాయి. ఈ భూముల్లోనే ఈటల రాజేందర్ 1980లో ఆరున్నర ఎకరాలు కొనుగోలు చేశానని చెబుతుండగా అధికారులు మాత్రం 60 ఎకరాలకు కబ్జా చేశారని అంటున్నారు. దేవరయాంజల్ లో ఆలయ భూములు కొనుక్కొని సాగు చేసుకుంటున్న చాలా మంది రేైతులు, ప్రైవేటు వ్యక్తులు భూముల క్రమబద్దీకరణకు దశాబ్దాల తరబడి కోర్టులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ భూముల వ్యవహారాన్ని గతంలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి, ఆ తరువాత సీఎం కేసిఆర్ దృష్టికి ఈటల రాజేందర్ తీసుకువెళ్లారు. ఈ భూముల కబ్జా వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దలు ఉండటం వల్ల స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలన్న డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈటలకు చెందిన జమున హెచరీస్ భూమలపై ఇటీవల హైస్పీడ్ గా జరిగిన విచారణను హైకోర్టు తప్పుబట్టింది. కేసిఆర్ సర్కార్ ఈ భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు గానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ విచారణకు లేదా చూడాలి మరి.

 


Share

Related posts

NTR : నితిన్ కోసం రంగంలోకి దిగుతున్న ఎన్టీఆర్..!!

sekhar

Pawan Kalyan : సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ కొడుకు..??

sekhar

Amala Paul Latest Photos

Gallery Desk