NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Etela Rajender: ఒంటరైపోయిన ఈటల!మాట్లాడే వారే కరువు!కేసీఆర్ పెట్టిన భయం అలాంటిది మరి !!

Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?

Etela Rajender: టీఆర్ఎస్ పార్టీలో సొంత పార్టీ నేతలే మంత్రి ఈటలను ఒంటరోడిని చేశారు. ఆరోపణలు వచ్చిన రెండు రోజులుగా ఆయన్ను ఎవరూ పలుకరించలేదు. కనీసం మాట్లాడే ప్రయత్నమూ చేయలేదు. తోటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు దూరంగా ఉంటున్నారు.

Etela Rajender isolated in trs Party
Etela Rajender isolated in trs Party

మొన్నటిదాకా వివిధ పనుల కోసం ఆయన ఇంటికివెళ్లే టీఆర్​ఎస్​ లీడర్లు.. ఇప్పుడు అటువైపు చూసేందుకూ జంకుతున్నారు. కేవలం ఆయన అనుచరులు తప్ప అంతా ఈటలను దూరం పెట్టారు. ఏడాదిన్నర క్రితం ‘గులాబీ జెండా ఓనర్లం’ అని ఈటల చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీంతో జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్​లో పెట్టిన మీటింగ్​లో సీఎం.. ఈటలను ఉద్దేశించి చేసిన పరోక్ష వ్యాఖ్యలతో అప్పటి నుంచే ఈటలకు పార్టీ లీడర్లు దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈటలమీద ఆరోపణలపై సీఎం కేసీఆర్​ స్వయంగా విచారణకు ఆదేశించడంతో ఆయనతో మాట్లాడేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కొందరు నేతలు మాత్రం తమ సన్నిహితుల ఫోన్ల నుంచి ఈటలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.

ఫోన్లు ట్యాప్​ చేస్తారన్న భయం

మొన్నటిదాకా ఈటలతో ఎంతో సన్నిహితంగా మెలిగిన కరీంనగర్​ నేతలూ ఆయన్ను కలవాలంటే భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈటలను కలిసినా, ఆయనతో మాట్లాడినా తమకే నష్టమన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫోన్లను ట్యాప్​ చేస్తారన్న భయంతో ఫోన్​ చేయాలన్నా వెనుకడుగు వేస్తున్నారు. ఈటలతో ఎవరూ ఏం మాట్లాడొద్దంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ప్రగతి భవన్​ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. శామీర్​పేటలోని ఈటల ఇంటి వద్ద కూడా ప్రత్యేక నిఘా టీమ్​లను ఏర్పాటు చేశారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆయన ఇంటికి ఎవరెవరు వస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారన్న విషయాలను ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈటలకు మద్దతుగా ఉన్న కొందరు బీసీ సంఘాల నేతలకూ ప్రగతి భవన్​ నుంచి ఫోన్లు వెళ్లాయని, మద్దతును ఉపసంహరించుకోవాలంటూ హెచ్చరించారని చెబుతున్నారు.

మాకెందుకన్న మంత్రులు!

బీజేపీ నేతల ప్రెస్​మీట్​ తర్వాత మంత్రులు తలసాని, మల్లారెడ్డిలు ప్రగతి భవన్​లో శనివారం మీడియాతో మాట్లాడారు. ఈటల అంశాన్ని ప్రశ్నిస్తే.. ఆ విషయం గురించి తామేమీ మాట్లాడబోమని, అన్నీ కేసీఆరే చూసుకుంటారని చెప్పారు. కేసీఆర్​ కన్నెర్రచేసిన నేతలెవరితోనూ తోటి నేతలు మాట్లాడరంటూ పార్టీకి చెందిన ఓ సీనియర్​ లీడర్ చెప్పారు.  ఆ లీడర్​ ఎదురుపడినా చూడకుండా పోతారని, ఎవరైనా మాట్లాడితే వాళ్లపని  అంతేనని ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న ఆ లీడర్​ చెప్పారు.

author avatar
Yandamuri

Related posts

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju