NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Etela Rajender : ఎవరిపై ఈ ‘ఈటెల్లాం’టి మాటలు..! అసహనమా.. తిరుగుబాటా..?

target etala rajendar starts

Etela Rajender : ఈటెల రాజేందర్ Etela Rajender: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన వ్యక్తుల్లో ఈటెల రాజేందర్ ఒకరు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుండి నడిపిస్తే.. ఆయన వెనుకే అడుగులు వేస్తూ పార్టీ జెండా మోసిన వ్యక్తుల్లో ఈటెల ప్రముఖ వ్యక్తి.

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్న సందర్భంలో అసెంబ్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. ఆయన్ను పేరు పెట్టి వైఎస్ పిలిచేంతగా ఈటెల గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో కేసీఆర్ కు అత్యంత ముఖ్యుల్లో ఈటెల రాజేందర్ కూడా ఒకరిగా నిలిచారు. అయితే.. ఇటివలి కాలంలో ఈ బంధానికి బీటలు వారినట్టే అనిపిస్తోంది. కొన్నాళ్లుగా ఈటెల వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

etela rajender sensational comments
etela rajender sensational comments

సొంత జిల్లా ఉమ్మడి కరీంనగర్ లో మంత్రి ఈటెల రాజేందర్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘కల్యాణ లక్ష్మి, పింఛన్లు పేదరికాన్ని దూరం చేయలేవు. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదు.. మనిషిని గుర్తు పెట్టుకోవాలి. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు.. కాని శాశ్వతంగా కాదు. పెట్టింది చెప్పొద్దు.. చేసిందీ చెప్పుకోవద్దు. నేను ఇబ్బంది పడుతూ ఉండొచ్చు.. గాయపడుతూ ఉండొచ్చు.. కానీ నా మనసు మారలేదు. పెట్టే చేయి ఆగదు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నన్ను గొప్పగా తీసుకెళ్లిన వారిని నేను మరువను. అందరి రుణం తీర్చుకునే వ్యక్తిని నేను. పరిగ ఏరిన వాడు చేను పండించినట్టు కాదు’ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి.

కొన్నాళ్లుగా సీఎం కేసీఆర్ కు మంత్రి ఈటెల రాజేందర్ కు మధ్య దూరం పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యమైన మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయనకు ఆహ్వానం అందడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో కేసీఆర్ నిర్వహించిన మంత్రివర్గ సదస్సుకూ ఆయనకు ఆహ్వానం అందలేదు. కొన్నాళ్లుగా ఈటెల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆమధ్య.. ‘పార్టీ పెట్టడం అంటే టీ కొట్టు పెట్టడం కాదు’ అని కేసీఆర్ అన్నారు. ఈటెలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలనే కామెంట్స్ వచ్చాయి. అయితే.. ఏదీ ఎక్కడా బహిర్గతం కాలేదు. కానీ.. ఈటెల అప్పుడప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు అనేక ఊహాగానాలకు ఊతమిస్తోంది. మరి ఈ గుట్టు వీడేదెన్నడో..!

 

author avatar
Muraliak

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju