సుధీర్ ఆనంద్ బయానా…ఈ పేరేంటి చాలా వింతగా..కాస్త కొత్తగా ఉంది. ఎవరిదీ పేరు..ఇలా ఫీలవడం పక్కా. ఎందుకంటే ఇలాంటి పేరు ఇంతకముందు ఎప్పుడు విని ఉండరు. అదే ‘సుడిగాలి సుధీర్’ అంటే మాత్రం రష్మీ తో కలుపుకొని కొన్ని మౌంటైన్ షాట్స్ అలా కళ్ళ ముందు కనపడతాయి. అదీ ‘సుడిగాలి సుధీర్’ అన్న పేరు కి ఉన్న క్రేజ్ అండ్ పాపులారిటీ. ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన సుధీర్ సినీ, టెలివిజన్ రంగాల్లో ‘సుడిగాలి సుధీర్’ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతోన్న ఎంటర్టైన్మెంట్ షోస్ తో భారీ స్థాయిలో పాపులారిటీని సాధించాడు. ఇక 2013 లో ప్రారంభమైన జబర్దస్త్ షో 7 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. జబర్దస్త్ లో కెరీర్ ప్రారంభంలో వేణు వండర్స్ లో టీమ్ లో ఒక మామూలు మెంబర్ గా ఉన్న సుధీర్ తన కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు. స్కిట్స్ లో ఎలాంటి పాత్ర తో అయినా సుధీర్ తన టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు.
తన టీమ్ లో గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, సన్నీ లతో కలసి స్కిట్ లు చేయడం మొదలు పెట్టిన సుధీర్ ఇప్పటికీ అదే టీమ్ తో అదే ఫామ్ లో కొనసాగుతున్నాడు. అయితే కొన్నాళ్ళు పాటు ఆ షో లో యాంకర్ రష్మీ కి సుధీర్ కి మధ్య క్లోస్ రిలేషన్ ఉన్నట్టు పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే అవి పుకార్లే అని ఇద్దరు చాలా సందర్భాలలో ఓపెన్ గా చెప్పారు. ఎన్ని పుకార్లు వచ్చినా సుధీర్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. జబర్దస్త్ తో మొదలైన తన ప్రయాణం సినిమా హీరో గా మార్చేసింది.
అయితే తాజాగా సుధీర్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్వరలోనే సుధీర్ జబర్దస్త్ షో నుంచి బయటకు రాబోతున్నాడని ఈ వార్త సారాంశం. అందుకు కారణం ఒక సినిమా అని తెలుస్తుంది. రీసెంట్ గా ఒక సినిమా కమిటయిన సుధీర్ కి డేట్స్ సమస్య వస్తుందట. దాంతో కొన్నాళ్ళు సుధీర్ జబర్దస్త్ షో కు దూరం కానున్నాడని తెలుస్తుంది.