Evaru Meelo Koteeswarulu : ఎవరు మీలో కోటీశ్వరులు షో గురించి అందరికీ తెలుసు. హిందీలో వచ్చిన కౌన్ బనేగా కరోడ్ పతి అనే షో కాన్సెప్టే ఇది కూడా. అక్కడ హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా ఉన్నారు. దాదాపు అన్ని సీజన్లకు అమితాబే హోస్ట్ చేస్తూ వస్తున్నారు.

హిందీ షోను చూసి కన్నడలోనూ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగులోనూ ఆ షో ప్రారంభం అయింది. మొదటి రెండు సీజన్లను స్టార్ మా చానెల్ లో నాగార్జున హోస్ట్ చేశారు. ఆ తర్వాత సీజన్ ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు.
తర్వాత కొన్నేళ్ల పాటు ఆ షోను ఆపేశారు. ప్రస్తుతం ఆ షో హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకుంది. దీంతో సరికొత్తగా ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ అందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ కావడంతో షోకు ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది.
ఎవరు మీలో కోటీశ్వరులు షోకు వెళ్లడం ఎలా? హాట్ సీట్ లో కూర్చోవాలంటే ఎలా? అనే ప్రశ్నలు అందరికీ మెదులుతున్నాయి.
Evaru Meelo Koteeswarulu : హాట్ సీట్ లో కూర్చోవాలంటే… ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
హాట్ సీట్ దాకా వెళ్లాంటే ముందు రోజూ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాన్ని పంపించాల్సి ఉంటుంది. నిన్న అంటే మార్చి 29 నుంచి ఏప్రిల్ 11 వ తేదీ వరకు రోజూ రాత్రి 8.15 కు ఒక ప్రశ్నను జూనియర్ ఎన్టీఆర్ జెమినీ టీవీలో అడుగుతారు.
ఆ ప్రశ్నకు సరైన సమాధానాన్ని వాళ్లు చెప్పిన నెంబర్ కు ఎస్ఎమ్ఎస్ చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చెప్పిన వాళ్ల మొబైల్ నెంబర్ ను ఆటోమెటిక్ ఆల్గారిథమ్ ద్వారా కంప్యూటర్ రాండమ్ గా ఎంపిక చేస్తుంది. లేదంటే సన్ నెక్స్ట్ అనే యాప్ ద్వారా కూడా వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు. ఇది లేవల్ వన్ సెలక్షన్. ఇలా మొత్తం నాలుగు లేవల్స్ లో షార్ట్ లిస్ట్ చేసి… చివరకు హాట్ సీట్ మీదికి చేరుకోవాల్సి ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం… రోజూ రాత్రి 8.15 నిమిషాలకు జెమినీ టీవీ చూసి… జూనియర్ ఎన్టీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పి… హాట్ సీట్ లో కూర్చునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి.