నితిన్ టార్గెట్ కూడా అదే.. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు .!

Share

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరసగా తన సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నాడు. వాస్తవంగా ఈ ఏడాదే మూడు సినిమాలు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కాని కరోనా కారణంగా ఒక్క భీష్మ సినిమా మాత్రమే రిలీజ్ చేయగలిగాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ టార్గెట్ ని 2021 లో కంప్లీట్ చేయాలని ప్లాన్ వేసుకుంటున్నాడు.

Rang De First Look: Nithiin birthday treat - tollywood

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఇప్పటికే చేస్తున్న సినిమా రంగ్ దే. ఈ సినిమాలో కీర్తి సురేష్ నితిన్ కి జంటగా నటిస్తుంది. సగానికి పైగా చిత్రీకరణ జరిగిన ఈ సినిమా లాక్ డౌన్ తో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే మళ్ళీ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా త్వరలోనే టాకీ పార్ట్ కంప్లీట్ కానుంది. దాంతో మిగతా రెండు ప్రాజెక్ట్స్ ని ట్రాక్ లోకి తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.

Nithin To Remake AndhaDhun in telugu

బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘అంధాదూన్’ సినిమాని నితిన్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీలో టబు చేసిన పాత్రని ఇక్కడ తమన్నా చేస్తోంది. అలాగే హీరోయిన్ గా నభా నటేష్ కన్‌ఫర్మ్ అయింది. ఈ సినిమాని త్వరలో సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని సన్నాహాలు జరుగుతున్నాయట.

Nithin in Check : నితిన్ కొత్త సినిమా టైటిల్ | జాతీయం News in Telugu

ఇక రీసెంట్ గా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ నటించబోతున్న మరో సినిమాని ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ అధికారకంగా ప్రకటించారు. ‘చెక్’ అన్న టైటిల్ తో తెరకెక్కబోయో ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. అంతేకాదు 2021 లో రంగ్ దే, అంధాధున్ రీమేక్, చెక్.. రిలీజ్ చేయాలని నితిన్ టార్గెట్ పెట్టుకున్నాడట.


Share

Related posts

కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన నటి కుష్బూ..! రేపు బీజేపీలో చేరిక..!!

somaraju sharma

Star heros cars : చిరంజీవి కారు అ”ధర”హో..! సౌత్ టాప్ హీరోలు వాడే కార్లు.. వాటి ధరలు తెలుసా..!?

bharani jella

బిగ్ బాస్ 4 : ఇంట్లో గొడవలపై షాకింగ్ కామెంట్స్ చేసిన అభిజిత్ వాళ్ళ అమ్మ…!

arun kanna