రంగస్థలం.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా నటించాడు. సమంత హీరోయిన్ గా నటించింది. అయితే ముందు వద్దన్నారు… ఆ తర్వాత అస్సలు సెట్ అవదన్నారు. స్టార్ హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్లు వేస్తే తేడా వస్తుందన్నారు. గ్లామర్ హీరోయిన్ ఈ క్యారెక్టర్ ని కరెక్ట్ ఛాయిస్ కాదన్నారు. ఏకంగా నో చెప్పేశారు. కానీ ఛాలెంజ్ గా తీసుకుంది.. తన సత్తా చూపించి రామలక్ష్మి గా డీ గ్లామర్ పాత్రలో నటించి అందరి నోరు మూయించింది సమంత.
రంగస్థలం మూవీలో రామలక్ష్మి పాత్రతో ఎంతో క్రేజ్ ని సంపాదించింది సామ్. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ సమంతా కెరీర్ కి ఓ మైలురాయిగా నిలిచింది. కానీ ఈ క్యారెక్టర్ అమ్మడికి దక్కెందుకు ఎంతో టైం పట్టిందట. మొదట ఒక గ్రామీణ పిల్లగా సమంతనే తీసుకుందామని సుకుమార్ చెప్పినప్పటికి యూనిట్ లో కొంతమంది.. సమంత అసలు సెట్ అవ్వదని చెప్పేశారట. ఈ విషయాన్ని ఎవరో కాదు సామ్ స్వయంగా చెప్పింది. క్యూట్ గా గ్లామరస్ హీరోయిన్ గా కొనసాగుతున్న సామ్ ని ఒక్కసారిగా ఇలా చూస్తే అభిమానులు యాక్సెప్ట్ చేయరని సలహా ఇచ్చారట.
అయితే సుక్కు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా హీరోయిన్ గా ఓకే చేసాడు. మొదట కథ విని ఇన్స్పైర్ అయిన సమంత తన క్యారెక్టర్ గురించి తెలుసుకోగానే చాలా ఎగ్జైట్ అయిందట. ఇదొక ఛాలెంజ్ గా తీసుకుందట. డైరెక్టర్ నచ్చేటట్టు ప్రేక్షకులు మెచ్చేటట్టు తన క్యారెక్టర్ లో జీవించి నటించి అందరి మన్నలను పొందింది సామ్. ఈ మూవీ సామ్ కెరీర్ లో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక పెళ్లి తర్వాత తీసిన మొదటి సినిమా రంగస్థలం కావడంతో మరింత ఉత్సాహంతో నటించింది సామ్. ఆ అనుభూతే వేరు అంటూ చెప్పుకొచ్చింది.