‘రాధే శ్యామ్’.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి చూపు ఈ సినిమా మీదే. ఈ సినిమాని ప్రభాస్ సంక్రాంతికి తీసుకు వస్తాడా లేదా సమ్మర్ కి తీసుకు వస్తాడా అని. డార్లింగ్ ఈ సినిమాని ఎప్పుడు తీసుకు వచ్చినా మిగతా సినిమాలకి గట్టి పోటీనే. సంక్రాంతికి అంటే అన్ని మీడియం బడ్జెట్ సినిమాలున్నాయి. కాబట్టి ‘రాధే శ్యామ్’ బరిలో దిగితే పవర్ స్టార్ వకీల్ సాబ్ తో నే గట్టీ పోటీ ఉంటుంది. ఒకవేళ సమ్మర్ కి అయితే అన్ని భారీ సినిమాలున్నాయి కాబట్టి అప్పుడు ఒకరకమైన ఉత్కంఠత నెలకొంటుంది.
ఏదేమైనా ప్రభాస్ నుంచి మాత్రం ‘రాధే శ్యామ్’ మోస్ట్ అవైటెడ్ సినిమాగా మారింది. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ పాత్రలో కనిపిస్తుండగా.. పూజాహెగ్డే ‘ప్రేరణ’గా కనిపించబోతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కాగా ఈ సినిమా తెలుగు.. తమిళ.. మలయాళ.. కన్నడ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకర్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవల రిలీజైన మోషన్ టీజర్ కి జస్టిన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. అయితే ఈ సినిమా నిర్మాతలు ‘రాధే శ్యామ్’ లో స్పెషల్ సాంగ్ ఉంటే బావుంటుందని దర్శకుడిని కోరారట. వాస్తవంగా అయితే కథ ప్రకారం ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉండే స్కోప్ లేదట. అయినా నిర్మాతలు అడుగుతున్నారంటే సినిమాకి ప్లస్ అవుతుందన్న ప్లాన్ అనే అంటున్నారు. మరి నిర్మాతలు అడిగినట్టు స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తారా లేదా చూడాలి. నిజంగా కథ ప్రకారం అవసరం లేకుండా మాత్రం ఇరికిస్తే మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!