వివాహ శుభలేఖలలో ఖచ్చితం గా ఉండే జానక్యాహః కమలామలాంజలి శ్లోకం  లో ఉండే రహస్యం తెలుసుకోండి!!

వివాహ శుభలేఖలలో ఖచ్చితం గా ఉండే జానక్యాహః కమలామలాంజలి శ్లోకం  లో ఉండే రహస్యం తెలుసుకోండి!!
Share

జానక్యాహః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః’ అన్న శ్లోకం చూచాయగా నన్నా తెలియని తెలుగువారుండరు.ఎందుకంటే పెళ్లి శుభలేఖ లన్నిటినీ దీంతోనే ప్రారంభించటం  అనేది  బాగా నాటుకు పోయిన తెలుగు సంప్రదాయం. తమ పిల్లల  వివాహ సందర్భం లో తెలుగువారు  ఆదర్శదంపతులైన సీతారాములను ఈ శ్లోకం ద్వారా మొదట తలచుకొని , శుభకార్యానికి శుభారంభం చేసుకొంటారు.
ఈ శ్లోకం సీతారాముల కళ్యాణం లో తలంబ్రాలు పోసుకొనే ఘట్టాన్ని వర్ణించి, ఆ తలంబ్రాలు మీకు శుభాలు కలింగించుగాక అని ప్రార్థిస్తారు.

వివాహ శుభలేఖలలో ఖచ్చితం గా ఉండే జానక్యాహః కమలామలాంజలి శ్లోకం  లో ఉండే రహస్యం తెలుసుకోండి!!

జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః
వ్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయి తాః
స్రస్తాఃశ్యామలకాయ కాంతికకలితాఃయాః ఇంద్ర నీలాయితాః
ముక్తాః శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః

ఇప్పుడు  దీని  అర్ధం తెలుసుకుందాం…
పెళ్లి కూతురు గా సీతమ్మ తల్లి , పెళ్లికొడుకైనా రామయ్య  తల మీద ముత్యాల తలంబ్రాలు పోస్తున్నదట. ఆ తలంబ్రాలు కమలాల వంటి నిర్మలమయిన ఆమె దోసిలిలో ఉన్నంత సేపు ఎర్రని పద్మరాగమణుల్లా మెరిసాయట. సీత  ఆ ముత్యాలనురామ  మస్తకం మీద ఉంచినప్పుడు ఆయన నల్లని కేశజాలం మీద అవి మల్లెపూల లాగా ఒప్పారాయట. ఆ తర్వాత ఆయన తల మీది నుంచి జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద పడ్డప్పుడు, అవి ఆయన శరీరకాంతితో కలిసి ఇంద్రనీలమణుల లాగా కనిపించాయట. అలాంటి సీత రామకళ్యాణ సందర్భపు ముత్యాల తలంబ్రాలు మీకందరికీ శుభం కలగ జేయు గాక అని కవి ప్రార్థన  అని అంటారు .
ఇంత  అద్భుతమైన, సుందరమైన, ఉదాత్తమైన భావం గల శ్లోకం కాబట్టే పెద్దలు దీనిని ప్రతి వివాహసమయం లోనూ స్మరించే లా ఉత్తమ సంప్రదాయం నెలకొల్పారు.ఈ శ్లోకం  అర్థం అంతా  తెలిసినా, తెలియక పోయినాఇప్పటికి ఈ సంప్రదాయం పాటిస్తున్నాం.ఇప్పుడు అర్ధం తెలిసింది కాబట్టి మరింత భక్తితో ఈ సాంప్రదాయం పాటిద్దాం.


Share

Related posts

ప్రొడ్యూసర్ల షరతులకు మల్టీప్లెక్స్ ఓనర్లు సై అంటారా?

Kumar

Maharashtra మహారాష్ట్ర హోం మంత్రిపై రచ్చ రచ్చ చేస్తున్న మాజీ సిపి!నిన్న సీఎంకు లేఖ!నేడు సుప్రీం కోర్టుకు పోక!

Yandamuri

Telangana Formation day celebrations: నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

somaraju sharma