న్యూస్ హెల్త్

పెళ్లి  సమయం లో ప్రతి తల్లి తన కొడుకుతో చెప్పవలిసిన మాటలు !!

పెళ్లి  సమయం లో ప్రతి తల్లి తన కొడుకుతో చెప్పవలిసిన మాటలు !!
Share

కొత్త గా పెళ్ళి చేసుకున్న లేదా  చేసుకోబోతున్న కొడుకుకి ప్రతి తల్లి ఇలా చెప్పగలిగితే అంతా శుభమే! పుట్టింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయి కి ఇక్కడ అలవాట్లు, పద్ధతులు కొత్తగా ఉంటాయి. అవి అలవాటు చేసుకునేవరకు తనకి సమయం ఇవ్వాలి. కొంచెం మోహమటంగా ఉండచ్చు, నువ్వే తనకి తోడుగా ఉండి మన ఇంటిలో తను సంతోషంగా ఉండేటట్లు చూసుకో.

పెళ్లి  సమయం లో ప్రతి తల్లి తన కొడుకుతో చెప్పవలిసిన మాటలు !!

నీ భార్యను ఎప్పుడూ అమ్మ తో పోల్చుకోకు, ఎందుకంటే మీ అమ్మకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం.. తాను ఎలా అమ్మలా చేయగలుగుతుంది.
నిన్ను నేను ఎంత గారాబం గా పెంచానో ఆమెని  తన  తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు .. కాబట్టి తనకు అన్ని అలవాటు అయ్యేదాకా సమయం ఇచ్చి నువ్వే మంచిగా చూసుకో. కొన్ని రోజులకు తను కూడా మంచి గృహిణి గా, తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది.
నీ భార్యకు చిన్న, చిన్న కానుకలు ఇచ్చి సర్ప్రైజ్ చేసి  తనని సంతోషం గా ఉండేలా చూసుకో.. అప్పుడప్పుడు అయినా సినిమా కో షికారు కో తీసుకుని వెళ్లు. తను పుట్టింటికి వెళ్ళేటప్పుడు తనతో కలసి నువ్వు వెళ్ళి రెండు రోజులు ఉండి తనని వదిలిపెట్టి రా. నువ్వు ఎంత బాగా చూసుకున్నా కూడా తను పుట్టింటి వారితో కలిసి కొన్ని రోజులు గడిపితే ని మీద ప్రేమ మరింత ఎక్కువవుతుంది.

నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో… తాను ఏదైనా అర్ధం చేసుకోలేక పొతే నెమ్మదిగా వివరించి చెప్పు. మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ప్రేమగా ఉండాలి.

తను, నీతో సమానం.  జీవితం లో నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆమెతో కూడా చర్చించు. నీ మంచిచెడులో జీవితాంతం తోడుగా ఉండేది తనే.
నీ లాంటి భర్త, మా లాంటి అత్తమామలు లభించడం తన అదృష్టం అని భావించేలా మనం అందరం ప్రవర్తిద్దాం… అని  ప్రతి  తల్లి  కొడుకు తో  చెప్పడమనేది మంచి విషయంగా గుర్తుపెట్టుకోవాలి.


Share

Related posts

ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం నోటిఫికేషన్

Siva Prasad

అబ్బబ్బబ్బ.. ఏం ఎనర్జీ.. ఏం డ్యాన్స్.. మెహబూబ్ చింపేశాడుపో?

Varun G

అరెస్టులు … ముస్లింలు … బాబు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar