Mother and Son Doing the Dishes
ఇదివరకటి రోజుల్లో ఆడవారికి ఇంటిపని, మగవారికి బయటపని అని కేటాయిన్చుకొనేవారు..కానీ ఇప్పటి పరిస్థితులు అలా లేవు…ఆడ,మగా అని తేడాలేకుండా ఇప్పుడు అందరు అన్నిపనులు చేయవలిసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరికీ కూడా అన్నిపనులు చిన్ననాటినుండే చేయడం నేర్పించాలి.అలా నేర్చుకున్నవారు భవిషత్తులో ఎలాంటి పరిస్థితులలోకూడా వెనుకంజవేయకుండా ఉంటారు. పిల్లలకు 18 ఏళ్లు రాకముందే ప్రతి తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మీ పిల్లలకు 12 ఏళ్ల లోపు చిన్న చిన్న పనులు చేయడం నేర్పించాలితర్వాత వంట చేయడం నేర్పించాలి. వంట అనేది ప్రతి ఒక్కరికీ అవసరం కాబట్టి.. దానిపై అవగాహన పెంచాలి. పరిస్థితిఎలాంటిది అయినాకూడా శారీరకంగా హింసించడం చాలా పెద్ద నేరమని,తల్లిదండ్రులు ఖచ్చితంగావారికీ అర్ధమయేలా చెప్పాలి.ఎవ్వరిని అయినా గౌరవించడం చాల అవసరమని ఎట్టి పరిస్థితులలో అగౌరవం గా నడుచుకోకూడదని పిల్లలకు తెలియచెప్పాలి.స్త్రీ లైనా, పురుషులైనా సమానంగా విలువ ఇవ్వాలని వివరించాలి.
అబ్బాయిలు ఏడ్చినప్పుడు, ఎమోషనల్ గా ఫీలయినప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు.. తిడుతూ ఉంటారు. అబ్బాయిలు ఇంత సెన్సిటివ్ గా ఉండకూడదు అని.. కానీ.. అలా ఏడవకుండా ఉంటే జీవితంలో మానసిక వ్యాధులకు కారణమవుతుంది. ఎమోషనల్ ఉన్నప్పుడు ఏడవడములో తప్పు లేదని.. బాధను బయటపెట్టేయాలని వివరించి చెప్పాలి.చాలా సందర్భాల్లో అబ్బాయిలు.. కొన్ని సందర్భాలలో అమ్మయిలు చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటారు.అలా ఉండడం ఎంత ప్రమాదకరమో వివరిస్తూ ఇతరుల పట్ల జాలి, దయ కలిగి ఉండటం ఎంత ముఖ్యమో చెప్పాలి.
ఇంటికి వచ్చిన వారితో ఎంత మర్యాదగా ఉండాలో ఎవ్వరికి ఎలా సహాయం చేయాలో ఎలా మాట్లాడాలో తినే విషయం లో ఎలా ఉండాలో వంటి విషయాలు తల్లిదండ్రి తప్పక నేర్పించాలి. చిన్నప్పటినుండే ఎందుకు అని పొరపాటున కూడా అనుకోవద్దు.. అప్పటినుండి నేర్పితేనే వారికీ బాగా అర్ధం అవుతుంది అని గుర్తు పెట్టుకోండి గారాబం గా చూసుకుంటూ వారికీ ఏమి తెలియకుండా పెంచడం వలన జీవితం లో ఎన్నో సమస్యలకు ఇబ్బందులకు గురిఅవవలిసి ఉంటుంది అని మరువకండి.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…