NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

AP Government : కుట్ర కుట్ర లో అసమర్ధత మచ్చ

AP Government : కుట్ర కుట్ర లో అసమర్ధత మచ్చ

AP Government : హిందూ ఆలయాల మీద దాడులు తర్వాత రాష్ట్రంలో జాతీయ నాయకులు, కుల నాయకుల విగ్రహాల మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వంసం చూపిస్తున్నారని దీని వెనుక భారీ కుట్ర ఉందని ప్రభుత్వ AP Government సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం… మరోపక్క హిందూ ఆలయాల దాడుల విషయంలో టీడీపీ నేతల హస్తం ఉందని, ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావాలని హిందూ వాదులను రెచ్చగొట్టేందుకు రాష్ట్రంలోని ఆలయాల మీద ఓ పద్ధతి ప్రకారం ప్రణాళికతో దాడులు చేస్తున్నారని వైయస్సార్ సిపి పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అంతకుముందు ఆరోపించారు… అంతేకాదు ఇటీవల ఏలూరు వింత వ్యాధి ఘటన మీద ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆళ్ల నాని వింత వ్యాధి ప్రబలడం వెనుక కుట్ర ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు.. ఈ మూడు అంశాల్లో కుట్రలు ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు… అధికార పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ ఎలాంటి కుట్రలు ఉన్నాయి ఆ కుట్రలు వెనుక ఉన్నది ఎవరు అని బయట పెట్టడం లో మాత్రం వెనుకబడి పోతున్నారు. ఎప్పుడు చూసినా ఆరోపణలు తప్ప ఆరోపణలకు బలం చేకూరే ఎలాంటి నిజాలు బయటపెట్ట లేక పోతున్నారు.

AP Government every thing is respond for tdp
AP Government every thing is respond for tdp

AP Government ఇది అసమర్ధత కిందకే వస్తుంది!

ఏదైనా ఘటన జరిగినప్పుడు దానిలో కుట్ర ప్రాణాలు ఉంటే వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పోలీస్ శాఖది. మరి ఆ కుట్ర కోణాలను బయటపెట్టి కుట్రదారులను జైలుపాలు చేయాల్సిన ప్రభుత్వాధినేతలు దీనిలో ఏవో ఉన్నాయని అనుమానాలు రేకిత్తిచడం తోనే సరిపెడుతున్నారు. ఏ ఒక్క ఘటన జరిగినా దానిని ప్రతిపక్ష నేతలతో చేసి దానికి రకరకాల కుట్ర కోణాలు చెబుతున్నారే తప్ప.. అసలు ఘటనలో నిందితులను మాత్రం బయట పెట్టలేకపోతున్నారు. ఇది ప్రభుత్వ అసమర్థత క్రిందకు వస్తుందే తప్ప… కొత్త కోణాలను మంత్రులు లేదా ప్రభుత్వ పెద్దలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రతి విషయాన్ని తెలుగు దేశం మీద తోసేసి, వారు చేసిన కొట్టగానే ప్రతి విషయాన్ని ప్రోజెక్ట్ చేయాలనుకుంటే అంతకు మించిన తప్పు మరొకటి ఉండదు.

AP Government వైస్సార్సీపీ కార్యకర్తలకు మాత్రమే!

ఓ విషయం మీద ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలా కాకుండా ప్రతి విషయాన్ని సైతం ప్రతిపక్షం మీద తోసేసి వారిదే అంత తక్కువ అన్నట్లుగా ఎత్తి చూపడం వల్ల ప్రభుత్వ తప్పిదాలు ఏమి మరుగున పడవు. ప్రతి విషయాన్ని ప్రతిపక్ష కుట్రగా అభివర్ణించిన అది వైసీపీ కార్యకర్తలకు మంచి స్టఫ్ అవుతుంది తప్ప… సాధారణ ప్రజానీకం మాత్రం ప్రతి విషయాన్ని ఎలా టిడిపి మీద తోసేసి ప్రభుత్వం చేతులు పట్టుకుని కూర్చుంటే దానిని ఎవరూ హర్షించరు.

ప్రజరోగ్యం మీద సైతం!

ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఏలూరు వింత వ్యాధి ఘటన విషయం లో కుట్ర కోణం ఉందని చెప్పడం పెద్ద విషయం. ప్రజారోగ్యం విషయంలో ఏమైనా కుట్రలు చేస్తే అది పెద్ద నేరం కిందకు వస్తుంది. మళ్లీ బయటకు రాలేని అంత పెద్ద శిక్షలు పడే అవకాశం ఉంది. మరి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ విషయంలో కుట్రకోణం ఉందని మీడియా ముఖంగా చెప్పిన ఆళ్ల నాని ఈ కుట్రలను ఛేదించే విషయం మీద దృష్టి పెడితే అసలు దొంగలు దొరుకుతారు. ఏదైనా ప్రాథమిక ఆధారం లభించకుండా ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం జరగదు. మరి అలాంటి ఆధారాన్ని పోలీసులకు ఇచ్చి లోతైన దర్యాప్తు చేస్తే, అసలు ప్రజారోగ్యం విషయంలో ఎవరు నాటకం ఆడుతున్నారు అనేది ప్రజలకు తెలుస్తుంది. ఒకవేళ దీనిలో ఏ పార్టీ ఉన్న ఏ రాజకీయ నాయకుడు ఉన్నా పెద్ద శిక్ష పడటం ఖాయం. అలా కాకుండా ప్రతి విషయాన్ని… ప్రభుత్వం మీద మచ్చ పడే ప్రతి అంశాన్ని ప్రతిపక్షానికి ముడిపెట్టి ప్రభుత్వం తప్పించుకోవాలని చూడడం అంత మంచి పద్ధతి కాదు. ఎప్పటికీ ఎప్పుడూ తమ సొంత పార్టీ కార్యకర్తలకు ఇది మంచి బూస్ట్ అయినా, సాధారణ ప్రజానీకం తటస్థ ఓటర్లకు మాత్రం ఇది విసుగు తెప్పించే చర్యగా మిగిలిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ప్రతి విషయాన్ని కుట్రకోణం తో ముడి పెట్టి బయటపడదామని భావించే కంటే అసలు కుట్రదారులు ఎవరు ఎలాంటి కుట్ర జరిగిందో బయటపెడితే ప్రజల నుంచి సైతం మద్దతు వస్తుంది.

 

author avatar
Comrade CHE

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!