తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో కింగ్ నాగార్జున రెండు గెటప్ లతో అదరగొట్టాడు. మొదటి ఎపిసోడ్ లోనే ప్రేక్షకులకి కావలిసినదానికంటే నాలుగు రెట్లు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అదే జోరు రోజూ కొనసాగుతుంది. ఇక ఈ సీజన్ లో ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఎంట్రీ ఇవ్వడం షో మీద క్రేజ్ విపరీతంగా పెరిగింది. షో మొద్లవక ముందు నుంచే గంగవ్వ బిగ్ బాస్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి.
అది నిజమే అయితే ఇక షో కి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్న ప్రచారం జోరుగా జరిగింది. ఇంకా చెప్పాలంటే యాంకర్స్, ఫేడవౌట్ యాక్టర్ల పేరు ప్రచారం లో నిలిచినా రాని హైప్ గంగవ్వ పేరు రాగానే వచ్చింది. అన్నట్లుగానే సోషల్ మీడియాలో గంగవ్వ పేరు ఇప్పుడు మారు మ్రోగి పోతుంది. చాలా మంది కూడా మేము బిగ్ బాస్ చూడం. కాని ఎలిమినేషన్ కు గంగవ్వ నామినేట్ అయతే ఖచ్చితంగా ఆమెకు మద్దతుగా నిలుస్తామంటూ పోస్ట్ లు పెట్టిన వారు ఇప్పటికే వేలల్లో ఉన్నారు.
ఈసారి బిగ్ బాస్ ను కేవలం గంగవ్వ కోసం చూడాలనుకుంటున్న వాళ్ళ సంఖ్య వేలలల్లోనే. గంగవ్వ హ్యాష్ ట్యాగ్ మొదటి రోజు జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యింది అంటే ఊహించుకోవచ్చు గంగవ్వ ఎంతగా పాపులర్ అయిందో. చెప్పాలంటే ఒక హీరోయిన్ కి ఓవర్ నైట్ స్టార్ గా వచ్చినంత వచ్చింది. ఇక గంగవ్వ మొదటి వారంలోనే ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యింది. అందరు కూడా ఆమె నామినేట్ అయినా ఈజీగానే సేవ్ అవుతుంది కనుక నోయల్ ను సేవ్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పి గంగవ్వని నామినేట్ చేయడం జరిగింది.
మొదటి వారంలోనే ఎలిమినేషన్ లో ఉండటంతో గంగవ్వ ఫాలోవర్స్ ఇప్పుడు భారీ ఎత్తున ఓట్లు వేస్తున్నారట. చాలా మంది సోషల్ మీడియాలో గంగవ్వకు ఓట్లు వేసి మరీ ఆ స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గంగవ్వకు ఈసారి అత్యధికంగా ఓట్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఏ కంటెస్టెంట్ కు రానన్ని ఓట్లు గంగవ్వకు వస్తున్నట్లుగా ఇప్పటికే స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మొత్తానికి గంగవ్వ హౌజ్ లో అందరికీ పోటీ ఇవ్వడం గొప్ప విషయమే.