Rajashekhar : రాజశేఖర్ సీనియర్ హీరోలలో తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ని మేయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఆ మధ్య కొన్ని సినిమాలు ఫ్లావడంతో గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ ఆ గ్యాప్ తర్వాత ఎంచుకుంటున్న కథలు వేటికవి చాలా భిన్నంగా ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా కొత్తగా ట్రై చేస్తున్నాడు. గతంలో ఆయన ఎక్కువగా పోలీస్ కథలు..ఫ్యామిలీ స్టోరీస్స్ చేసేవాడు. యాంగ్రీ మాన్ అన్న పేరు రాజశేఖర్ కి రావడానికి కారణం ఆయన చేసి ఆహుతి, ఆగ్రహం, అంకుశం లాంటి సినిమాలే.
ఇక తాజాగా ఈ సీనియర్ హీరో నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. యంగ్ డైరెక్టర్ లలిత్ దర్శకత్వంలో ‘శేఖర్’ అన్న సినిమా ప్రకటించారు రాజశేఖర్. శివాని శివాత్మిక వెంకట్ శ్రీనివాస్ బొగ్గరం సత్యానారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత నెలలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంది. రాజశేఖర్ 91వ సినిమాగా తెరకెక్కుతుండగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ‘కేరాఫ్ కంచరపాలెం’ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి డిఫ్రెంట్ సినిమాలను తెరకెక్కించిన వెంకటేష్ మహా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.
Rajashekhar : మూడు సినిమాలు డిఫ్రెంట్ జోనర్స్ లో తెరకెక్కబోతున్నాయి.
రాజశేఖర్-వెంకటేష్ మహా కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకి ‘మర్మాణువు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పేరుతోనే ప్రత్యేకత సొంతం చేసుకున్న ఈ సినిమా పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను శివాని శివాత్మిక విజయ ప్రవీణ పరుచూరి నిర్మిస్తుండగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే మరో సినిమాకి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మూడు సినిమాలు డిఫ్రెంట్ జోనర్స్ లో తెరకెక్కబోతున్నాయి. మొత్తానికి రాజశేఖర్ ప్రస్తుతం ఎంచుకుంటున్న కథలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?