Samantha: ఇండస్ట్రీలో చాలామంది సమంతవైపే ఉన్నారు..అందుకు కారణాలు ఇవే..!

Share

Samantha: సమంత – నాగ చైతన్యలు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు మొదలైనప్పటి నుంచి.. అఫీషియల్‌గా వారే విడాకుల విషయాన్ని కన్‌ఫర్మ్ చేసినప్పటి వరకు ఎన్ని రకాల వార్తలు వచ్చి వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అభిమానులతో పాటు చాలామంది ఈ జంట విడిపోకుండా ఉంటే బావుంటుందని కోరుకున్నారు. కానీ, అప్పటికే సమంత – నాగ చైతన్య ధృడంగా నిర్ణయించుకోవడంతో విడిపోక తప్పలేదు. ఇక విడిపోతున్నట్టు ప్రకటించినప్పటి నుంచి అందరూ సమంతనే ట్రోల్ చేశారు.. ఆమెనే టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేశారు.

everyone are on samantha side because of these reasons...
everyone are on samantha side because of these reasons…

కానీ నాగ చైతన్యను కామెంట్ చేసినవారు చాలా తక్కువ. ఏదేమైనా ఈ జంట ఎందరికో ఆదర్శంగా ఉండి..ఒక్కసారిగా ఇలా షాకివ్వడం చాలామంది నమ్మలేకపోయారు. అయితే సమంతను ఇండస్ట్రీలోని వారు చాలామంది బాగానే సపోర్ట్ చేశారు..చేస్తున్నారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా మెగా కోడలు ఉపాసన కొణిదెలతో కలిసి వారి ఇంట్లో దీపావళి పండుగ సంబరాలలో పాల్గొనింది. దీనికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అంతకముందు కూడా త్రిష తో కలిసి సందడి చేసింది.

Samantha: ఈ విషయాలను ఆమె స్వయంగా ఎప్పుడూ బయటకు చెప్పుకుంది లేదు.

ఇక ఇటీవల కూడా తనకు అత్యంత సన్నిహితురాలైన డాక్టర్ పుట్టిన రోజు వేడుకకు హాజరయి శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు కొండంత అండగా నిలిచావని నువ్వు నా నిజమైన స్నేహితురాలివంటూ కామెంట్ జత చేసింది సమంత. ఇక ఇదే సమయంలో దర్శకురాలు నందిని రెడ్డి, మాళవిక మోహన్ కూడా సమంతతో ఉన్నారు. ఇలా టాలీవుడ్ దర్శక నిర్మాతలు, నటీ నటులు, మెగా కోడలు.. లాంటి వారు సమంతకు అండగా నిలిచారంటే సమంత మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

సమంతను ఇంతగా అభిమానించడానికి చాలా కారణాలున్నాయి. ఆమె హీరోయిన్‌గా మంచి క్రేజ్ వచ్చినప్పటి నుంచి ఆమె నటిస్తున్న కమర్షియల్ యాడ్ ఫిలింస్ అలాగే షాపింగ్ మాస్ ఓపెనింగ్స్ ..ఇతర కార్యక్రమాల ద్వారా వచ్చిన సంపాదనను ఆమె నిర్వహిస్తోన్న ప్రత్యూష ఫౌండేషన్‌కు ఇస్తోంది. ఎంతో మంది అనాధ పిల్లలను ఆదుకుంటున్న ఆమె ఇతర సేవా కార్యక్రమాలకు కావాల్సిన నిధులను సమకూర్చుతూ తనలోని మానవత్వాన్ని చాటుకుంటుంది. అయితే సమంత తోటి వారికి సహాయం చేయడంలోనూ ముందుంటూ గొప్ప మనసు చాటుకుంటోంది. కానీ ఈ విషయాలను ఆమె స్వయంగా ఎప్పుడూ బయటకు చెప్పుకుంది లేదు.

Samantha: కాబట్టే ఇండస్ట్రీలో చాలామంది ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

కానీ తాజాగా తేజస్విని మదివాడ అనే యంగ్ హీరోయిన్ మాత్రం సమంత వల్ల పొందిన సహాయాన్ని బయటపెట్టింది. కొన్నేళ్ళ క్రితం తేజస్వినీకి టీబీ రావడంతో ఖచ్చితంగా ఆపరేషన్ అవసరమవుతుందని డాక్టర్ చెప్పారు. కానీ ఆ సమయంలో ఆమె వద్ద ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదు. అంతేకాదు ఆమెకు అమ్మా నాన్నలు లేకపోవడంతో విషయం తెలుసుకున్న సమంత తేజస్వినికి ఆపరేషన్ చేయించింది. కానీ ఈ విషయాన్ని ఎప్పుడు బయటకు చెప్పుకోలేదు. అయితే కొందరు సమంతను తప్పుపడుతూ మట్లాడుతున్నది చూసి తట్టుకోలేకనే ఇప్పుడు తేజస్విని ఈ విషయాన్ని బయట పెట్టిందట. ఇలాంటి ఎన్నో విషయాలలో సమంత తన గొప్ప మనసు చాటుకుంది కాబట్టే ఇండస్ట్రీలో చాలామంది ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.


Share

Related posts

Big Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఇంటి సభ్యులు వీరే..!!

sekhar

ఖాళీ కడుపు తో నీళ్ళు తాగితే .. బంగారం లాంటి ప్రయోజనాలు !

Kumar

YS Jagan: ముందు మోడీ , ఆ త‌ర్వాత జ‌గ‌న్‌… ఓ ప్ర‌త్యేక‌త‌

sridhar