నేచురల్ స్టార్ నాని చిత్ర పరిశ్రమలోకి సోలోగా వచ్చి నేచురల్ స్టార్ నాని అనే బిరుదుతో పాటుగా తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకున్నాడన్న విషయం తెలిసిందే. కాగా నిన్న మొన్నటి వరకు మిడ్ రేంజులో ఉండే నాని సినిమాల బిజినెస్ కాస్తా ఈ మధ్య కాలంలో ఆకాశపుటంచుల్ని టచ్ చేస్తోంది. ఇక 2018లో కింగ్ నాగార్జునతో కలిసి, నాని నటించిన దేవదాస్ విమర్శకుల ప్రశంసలు అందుకోగా ఆ సినిమాలో నాని నటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. అంతే కాకుండా తాను ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమాకి తనే ప్లస్ కాబట్టి నాని రేంజ్ ఇప్పుడు హైలెవల్లో ఉందన్న టాక్ వినిపిస్తోంది.
అదీగాక ఈ సంవత్సరం కరోనా వల్ల చిత్రపరిశ్రమ చిన్నబోయిందన్న విషయం తెలిసిందే. దీనివల్ల చాలా సినిమాలు ఆగిపోగా కొంతమంది నటులు ఇళ్లకే పరిమితం అయ్యారు. కానీ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ‘టక్ జగదీష్’ చిత్రీకరణలో ఉండగానే.. శ్యామ్ సింఘరాయ్ చిత్రాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత అంటే సుందరానికి అన్న సినిమాని చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించాడు. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి ఓకే చెప్పాడట.
ఇకపోతే ఓటీటీ విడుదలైన నాని చిత్రం ‘వి’ ఫ్లాపైనా నాని రేంజ్ ఎంతమాత్రం తగ్గలేదనడానికి ఈ లైనప్ పెద్ద ఎగ్జాంపుల్ అని తెలుస్తుంది. అదీగాక నాని సినిమాలతో నిర్మాతలు భారీ లాభాలను ఆర్జిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే టాలీవుడ్ లో నాని మీద .. నాని సినిమాల మీద కరోనా ప్రభావం ఏమాత్రం పడలేదని అర్ధం అవుతుంది. ఇక ఈ విషయంలో నాని ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతుండగా, ఈ విషయాన్ని నెటిజన్స్ హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారట. ఏదేమైనా నాని సినిమాలతో టాలీవుడ్ లో యంగ్ హీరోలని దాటుకొని ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నాడు. త్వరలో నాని పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్ కూడా దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.