Akhanda: ఇప్పుడు అందరి చూపు బాలయ్య మీదే..డిసెంబర్ 2న ఏం జరుగుతుందో..?

Share

Akhanda: ఇప్పుడు అందరి చూపు నట సింహం నందమూరి బాలకృష్ణ మీదే ఉంది. ఆయన సినిమా గనక బ్లాక్ బస్టర్ అయితే బాక్సాఫీస్ లెక్కలు ఖచ్చితంగా మారతాయి అని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. గతకొంత కాలంగా బాలకృష్ణ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. క్రేజ్ పరంగా బాలకృష్ణకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కూడా కాస్త నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు ఆధికంగా నష్టం అయితే వస్తుంది. అందుకే ఈసారి బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాతో అందరినీ సంతోషపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.

everyone are waiting for akhanda-release
everyone are waiting for akhanda-release

వినయ విధేయ రామ సినిమాతో తీవ్ర నిరాశ చెందిన దర్శకుడు బోయపాటి శ్రీను కూడా మంచి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలాని కసితో ఉన్నాడు. బోయపాటికి ఓ సాలీడ్ హిట్ కావాలి. ఇద్దరిలోనూ అదే కసి ఉంది. ఆ కసితోనే అఖండ సినిమాను చేస్తున్నారు. ఇప్పటికే అఖండ సినిమా నుంచి వచ్చిన ప్రతీది భారీ స్థాయిలో సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఇక థమన్ మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్ అని ఇప్పటికే టీజర్స్, సాంగ్స్‌తో అర్థమైంది. అంతేకాదు బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఆ రకంగానూ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

Akhanda: కొందరిలో అనుమానాలు మొదలయ్యాయి.

అంతేకాదు ఈ సినిమా డిసెంబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు కోవిడ్ ప్రభావం లేనప్పటికీ మళ్ళీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొందరిలో అనుమానాలు మొదలయ్యాయి. జనాలు థియేటర్స్‌కు వస్తారా లేదా..ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు కూడా నియంత్రించడం జరిగింది. వీటి ప్రభావం సినిమా మీద ఏమాత్రం ఉండదని బాలయ్య అఖండ నిరూపిస్తే ఆ తర్వాత క్రిస్మస్ పండుగ సందర్భంగా వచ్చే పుష్ప మరికొన్ని సినిమాలు..సంక్రాంతి సీజన్‌లో రానున్న ఆర్ఆర్ఆర్, ‘రాధే శ్యామ్’ ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలకు మాంచి ఊరట, ఉత్సాహం కలుగుతాయి. లేదంటే ఏం జరుగుతుందో చెప్పలేము.


Share

Related posts

బిగ్ బాస్ 4: టాస్క్ లో గాయపడ్డ టాప్ కంటెస్టెంట్, హౌస్ లోకి మెడికల్ టీం..??

sekhar

బిగ్ బాస్ 4 : నోయిల్ పొగరు దించబోతున్న బిగ్ బాస్ .. కెప్టెన్ అయిన కాసేపటికే షాక్ !

arun kanna

రేపు ఏపి మంత్రివర్గ సమావేశం

Special Bureau