Love story : లవ్ స్టోరీ .. అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి నటించిన లేటెస్ట్ సినిమా. రొమాంటిక్ లవ్ స్టోరీగా దర్శకుడు శేక్ఝర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా మీద బాగా హైప్ క్రియేటయింది. లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్,
టీజర్ ప్రేక్షకుల్లో ఫ్రెష్ ఫీలింగ్స్ తెప్పిస్తూ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు చేశాయి. రీసెంట్ గా రిలీజైన సారంగ దరియా సాంగ్ లో సాయి పల్లవి డాన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ ఒక్క సాంగ్ రిలీజైయ్యాక లవ్ స్టోరీ సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక శేఖర్ కమ్ముల మార్క్ ఎలాగో కలిసి వచ్చే అంశం. అంతేకాదు ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల – సాయి పల్లవి ల కాంబినేషన్ కి కూడా ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉంది. ఇవన్ని కలిపి లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి బాగా కలిసి వచ్చాయని అంటున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు నాగ చైతన్య నటించిన ఏ సినిమాకి జరగనంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. తాజాగా ఫిలిం నగర్లో వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే ‘లవ్‌స్టోరి’ సినిమా ఆంధ్ర హక్కులు 15 కోట్ల కు సేల్ అయ్యాయని తెలుస్తోంది.
Love story : లవ్ స్టోరీ 50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్టు తెలుస్తోంది.
శేఖర్ కమ్ముల సినిమాలకు ఉండే డిమాండ్ వల్ల ఓవర్సీస్లోనూ సినిమా మంచి బిజినెస్ చేసిందని అంటున్నారు. ఓవర్సీస్ హక్కులు 6 కోట్లకు సేల్ అయ్యాయని సమాచారం. ఇక ఈ సినిమా నిర్మాణంలో భాగమైన ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ వాళ్లకు నైజాంలో సొంత డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి నైజాం ఏరియాలో వాళ్లే సొంతంగా రిలీజ్ చేసుకుంటారు. మొత్తంగా చూస్తే శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి దాదాపు 50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 16 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.