Vivekananda reddy: వివేకా హత్య కేసులో ఆ ఎంపీ చుట్టూ సాక్షాలు – ఆధారాలు..

Share

Vivekananda reddy: కడప మాజీ ఎంపి, మాజీ మంత్రి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బాబాయ్, మాజీ సీఎం వైఎస్ఆర్ కు స్వయానా సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ 99 అడుగులు ముందుకు వేసింది. ఇక ఆ ఒక్క అడుగు వేస్తుందా? వేయదా? అన్ని ప్రశ్నార్థకంగా ఉంది. 99 అడుగులు వేసిన సీబీఐ ఆ ఒక్క అడుగు వేసేస్తే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపిలో సీబీఐ అంటే ఒక పెద్ద నమ్మకం ఏర్పడుతుంది.

కారణం ఏమిటంటే వివేకా హత్య కేసులో కళ్లు, చూపులు, ఆధారాలు, సాక్షాలు అన్నీ కూడా ఒకళ్లవైపే చూపిస్తున్నాయి. ఒక కీలక ప్రజానిధివైపే చూపిస్తున్నాయి. ఇక్కడ కీలక ప్రజాప్రతినిధి అంటే అందరికీ అర్ధం అయ్యే ఉంటుంది. పర్టిక్యులర్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట. అక్కడ దొరుకుతున్న సాక్షాలు గానీ, ఆధారాలు గానీ కొందరు అనుమానితులు చెబుతున్న సమాచారం గానీ వారు ప్రాధమికంగా అందిస్తున్న అధారాలు గానీ అన్ని కూడా ఆయన వైపే చూపిస్తుండటంతో ఈ హత్య కేసు దర్యాప్తులో ఈ వందో అడుగు పడుతుందా? లేదా ఆ ప్రజా ప్రతినిధిని అరెస్టు చేస్తారా? లేదా అనే కీలక సందేహం అందరిలో వ్యక్తం అవుతోంది. వివేకా హత్య కేసు ప్రస్తుతం ఈ స్థితిలో ఉంది.

సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసిన తరువాత అతని కుటుంబాన్ని కిరణ్ కుమార్ యాదవ్, వాళ్ల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని వాళ్లు చెప్పిన చోటకు వెళ్లి ఆధారాలు తీసుకున్నారు. అంటే హత్యకు ఉపయోగించిన ఆయుధాలు సేకరించారు. ఈ ఆయుధాలు ఎవరు సమకూర్చారు, ఎవరు అందించారు అనేది తెలుసుకుని వాళ్లను తీసుకుని వాళ్లను ప్రశ్నించారు. వాళ్లతో పాటు కడప ఎంపి అవినాష్ రెడ్డి పిఏను కూడా ప్రశ్నించారు. అంతే కాక కడప జిల్లా పులివెందులలో పని చేసే సాక్షి మీడియా ప్రతినిధిని ప్రశ్నించింది సీబీఐ. వివేకా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్లను, అలాగే ఆయన హత్యకు ఆయుధాలను సరఫరా చేసిన వాళ్లను, ఎంపి పీఎలను ప్రశ్నిస్తున్న సీబీఐకి కళ్లు, చూపులు, సాక్షాలు, ఆధారాలు కూడా అన్నీ కూడా ఆయన వైపే చూపిస్తున్నాయి. ఇన్ని చెప్పిన తరువాత ఆయన ఎవరు అన్నది అందరికీ అర్ధం అయ్యే ఉంటుంది. ఇప్పుడు ఆయనను అరెస్టు చేస్తారా? లేదా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

నిజానికి వివేకా హత్య కేసులో ఆ అరెస్టు అంత ఈజీ కాదు. కోర్టులో ఈ కేసు నిరూపించడం, చార్జీషీటు దాఖలు చేయడం, దానికి తగ్గట్లు కోర్టులో నిరూపించడం, కోర్టుకు ఆధారాలు సమర్పించడం, నిర్ధారించడం అంత ఈజీ కాదు. సమాచారం సేకరించడం సులువే కానీ వాటికి సంబంధించి అధారాలు సంపాదించడం కొంచెం కష్టం అయినా సులువే కానీ దాన్ని కోర్టును నమ్మించేలా అధారాలు అన్నీ నిరూపించడం, నిర్ధారించడమే కష్టం. అదే కీలకమైన ప్రక్రియ. చాలా హత్య కేసులో అక్కడితేనో వీగిపోతుంటాయి. పోలీసులు గానీ సీబీఐ గానీ ఎన్ఐఏ గానీ ఎవరు ఎంత పరిశోధించినా ఎవరు ఎంత ఆధారాలు సేకరించినా కోర్టులో నిరూపించలేక చేతులు ఎత్తేస్తారు. ఇక్కడ వివేకా హత్య కేసులో కూడా సీబీఐ కోర్టు వరకూ వస్తుంది. కిరణ్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేయడం, రిమాండ్ కు తీసుకోవడం, వాళ్ల కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోవడం, వాళ్లు ఇచ్చిన సమాచారంతో కడప ఎంపి అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం అందరికీ తెలిసిందే.

హత్య కేసు దర్యాప్తు చేయడం ఈజీనే కానీ అధారాలు నిరూపించడమే కష్టం. వివేకా హత్య కేసులో 99 అడుగులను కూడా సీబీఐ అంత సులువుగా వేయలేదు. సీబీఐ అధికారులు రెండు మూడు సార్లు విచారణ చేసి మిన్నకుండగా వివేకా కుమార్తె సీబీఐ దర్యాప్తు తీరుపై మీడియా సమావేశంలో ఏకరవు పెట్టడంతో నాల్గవ సారి విచారణలో రెండు నెలలకు పైగా సోధించి 99 శాతం ప్రగతి సాధించింది సీబీఐ. ఇక సీబీఐ కీలక అరెస్టులు చేసి సీబీఐకి ప్రజల్లో నమ్మకాన్ని కల్గిస్తుందా లేదా అన్నది కడప, పులివెందులల్లో పెద్ద చర్చ జరుగుతోంది. చూడాలి ఏమి జరుగుతుందో?


Share

Related posts

Prabhas Mahesh: ప్రభాస్, మహేష్ వ్యక్తిత్వాలు గురించి సంచలన విషయాలు చెప్పిన సుబ్బరాజు..!!

sekhar

ఫోటో బ్రేకింగ్ న్యూస్: కొత్త లుక్ లో గుండుతో చిరంజీవి – షాక్ అవ్వడం పక్కా!

Vihari

Priyamani: సెకండ్ ఇన్నింగ్స్‌లో చెలరేగిపోతున్న ప్రియమణి..పెళ్ళి తర్వాత గుడ్‌బై చెప్తుందనుకున్నవాళ్ళకి షాకులిస్తోంది

GRK