ఇన్‌చార్జి సిఎస్ నీరబ్‍‌‌కు బాధ్యతలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి సిఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సిఎస్ నుండి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డిజిగా నియమించిన విషయం తెలిసిందే.