EX Justice Chandru: జగన్ సర్కార్ కు బూస్ట్ ఇచ్చిన జై భీమ్ ఫేమ్, జస్టిస్ చంద్రు..! ఏపి హైకోర్టు వ్యవహారాలపై సంచలన కామెంట్స్..!!

Share

Ex Justice Chandru: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏపి హైకోర్టు అనేక ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టింది. సింగిల్ బెంచ్ తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే డివిజన్ బెంచ్ లో అనుకూలంగా రావడం, పలు మార్పు డివిజన్ బెంచ్ లోనూ వ్యతిరేక తీర్పులు రావడం జరిగింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో, జీవోలలో తప్పులు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ తీర్పులు వస్తుండటంతో జగన్ సర్కార్ కు హైకోర్టు వ్యతిరేకం అని జనాలు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఇంతకు ముందు కొంత మంది వైసీపీ అభిమానులు న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో హైకోర్టు సుమోటోగా తీసుకుని వాళ్లపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో చాలా మంది హైకోర్టు తీర్పులపై మాట్లాడటం మానేశారు. ఈ తరుణంలో జై భీమ్ ఫేమ్, మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు జగన్ సర్కార్ కు బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. ఏపిలో పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

EX Justice Chandru sensational comments on ap judiciary
EX Justice Chandru sensational comments on ap judiciary

Ex Justice Chandru: న్యాయ వ్యవస్థతో ఏపి ప్రభుత్వం యుద్ధం

ఏపి హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. పౌర హక్కుల అమలు, సామాజిక న్యాయం – జై భీమ్ సినిమాపై విశ్లేషణ అనే అంశంపై విజయవాడ జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఏపిలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రయత్నిసతోందనీ, శతృవులు, ప్రత్యర్ధులతో కాదు న్యాయ వ్యవస్థతో యుద్ధం చేస్తోందన్నారు. అమరావతి భూ కుంభకోణంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. రాజధాని పిటిషన్ లకు సంబంధించి బెంచ్ లో ఇద్దరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములు కేటాయించారు వారిని తప్పించాలని ప్రభుత్వం కోరితే ధర్మాసనం అంగీకరించలేదన్నారు. ఇక కేసు విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఆ బిల్లులను వెనక్కి తీసుకుందన్నారు. ఇలాంటి జడ్జిలు న్యాయ వ్యవస్థలో ఉన్నంత కాలం తమకు న్యాయం జరగదని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకునట్లు ఉందన్నారు.

సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వచ్చిన పోస్టుల వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని, ఎఫ్ఐఆర్ నమోదు చేయించి సీబీఐకి అప్పగించిందన్నారు. నలుగురుని అరెస్టు చేసిన సిబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేయడానికి విదేశాలకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నామన్నారు. కోర్టు తీర్పులను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు సీీబీఐ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారణమన్నారు. ప్రభుత్వంలో ఏదైనా వ్యవస్థ కౌంటర్ ఫైల్ చేయకపోతే వాళ్లకి జరిమానా విధించవచ్చనీ, మొన్న సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కౌంటర్ వేయకపోతే లక్ష రూపాయల జరిమానా విధించిందని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే ఈ రిటైర్డ్ న్యాయమూర్తి చేసిన సంచలన వ్యాఖ్యలపై ఏపి హైకోర్టు రెస్పాండ్ అవుతుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డికి కీలక పదవి అప్పగించిన కెసిఆర్ సర్కార్

somaraju sharma

ఆ ఒక్క పిక్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న రాశి ఖన్నా .. !!

sekhar

Video Viral: ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే నంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఓ సంఘ నేత బండి..!!

somaraju sharma