NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Janasena-Tdp : జనసేన-టీడీపీ మైత్రికి మాజీ ఎంపీ ప్రయత్నాలు..!! నిజమెంతో..!?

Janasena Pavan kalyan: Political Plannings, twists in 2023

Janasena-Tdp: జనసేన-టీడీపీ Janasena-Tdp: రాష్ట్రంలో వైసీపీ సొంతంగానే అధికారంలోకి వచ్చేంత బలం ఉందని 2019 ఎన్నికలు నిరూపించాయి. రెండేళ్ల తర్వాత కూడా వైసీపీ బలమేంటో.. బ్యాలెట్ ఓటింగ్ జరిగిన మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయి. ఏపీ పొలిటికల్ వీల్ లో వైసీపీ అంత స్ట్రాంగ్ బేస్ మరెవరికీ లేదని స్పష్టమైపోయింది. తెలంగాణలో టీడీపీ పూర్తిగా చతికిలపడితే.. ఏపీలో పరిస్థితి ఏమీ చెప్పలేనట్టు ఉంది.

బీజేపీ గురించి నేతలు చెప్పుకున్నంతగా ప్రజల్లో బలం లేదని మొన్నే తేలిపోయింది. మిగిలింది జనసేన. ఇప్పుడు ప్రతి పార్టీ లక్ష్యం పవన్ తో కలిసి వెళ్లడం.. జనసేనతో పొత్తు ఆలోచించడం.. పవన్ క్రేజ్ ను ఉపయోగించుకోవడం. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనను టీడీపీ తనవైపుకు లాక్కునే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

ex mp trying to janasena help to tdp Janasena-Tdp
ex mp trying to janasena help to tdp Janasena Tdp

ఇటివల జరిగిన రాజకీయ పరిణామాలే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది. తెలంగాణలో బీజీపీతో దాదాపు కటీఫ్ చెప్పేసిన పవన్ ఏపీలో కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. తిరుపతి ఎంపీ టికెట్ ఆశించిన జనసేనకు బీజేపీ అడ్డుపడి తన అభ్యర్ధినే నిలుపుతోంది. జనసేన మద్దతుతో ముందుకెళ్తామని బీజేపీ స్పష్టం చేసింది. అయితే.. జనసేన నుంచి మాత్రం పెద్దగా ప్రకటనలు, జనసైనికుల నుంచి ఉత్సాహం, పవన్ నుంచి ప్రోత్సాహం అయితే కనపడటం లేదు. దీంతో జనసేన-బీజేపీ మైత్రిపై అనేక ప్రశ్నలు నెలకొన్నాయి. ఇదే ఇప్పుడు టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు టీడీపీ మాజీ ఎంపీ ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది.

ఇటివలి మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం తాడిపత్రిలో జేసీ సోదరులు తమ హవా నిలబెట్టుకున్నారు. ఇదే సమయంలో వైసీపీని ఢీకొట్టడం ఎంత కష్టమో కూడా వారికి తెలిసింది. దీంతో టీడీపీకి జనసేనను దగ్గర చేసే ఆలోచనను చిరంజీవితో దివాకర్ రెడ్డి పంచుకున్నారని తెలుస్తోంది. ఇటివల హైదరాబాద్ వెళ్లిన జేసీ చిరంజీవిని కలిశారని అంటున్నారు. జనసేన బలపడాలన్నా.. వైసీపీకి చెక్ పెట్టాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క పార్టీ వల్ల కూడా కాని పని అని చెప్పారట. దీంతో టీడీపీతో కలసి వెళ్తే వైసీపీకి ఓడించగలమనే చెప్పారట. దీనిపై పవన్ తో చర్చించాలని కూడా సూచించారని సమాచారం. మరి.. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే..!

author avatar
Muraliak

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju