NewsOrbit
న్యూస్

‘కమలం’ వైపు ఆ ఖాకీ అధికారి చూపు!ఎవరది.. ఏమా కథ??

జనసేన నుండి బయటకు వచ్చాక చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో తిరిగి యాక్టివ్ కానున్నారట.

జగన్ అక్రమాస్తుల కేసుతో ఒక్కసారిగా రాష్ట్రంలో అత్యంత ఇమేజ్ ఉన్న పోలీస్ అధికారిగా జేడీ లక్ష్మీనారాయణ పేరు తెచ్చుకున్నారు అప్పట్లో ఏ పత్రిక చూసినా,టీవీ చానెల్లో చూసినా లక్ష్మీనారాయణ వార్తలే కనిపించేవి.అంతేగాక ఆయనకు క్లీన్ ఇమేజ్ కూడా ఉంది.సిబిఐ నుండి వైదొలిగాక ఆయన మహారాష్ట్రలో ఉన్నత పదవిలో ఉంటూ ఎందుకనో రాజకీయాల వైపు వచ్చేశారు.అనూహ్యంగా ఆయన జనసేన పార్టీలో చేరిపోయారు. జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు అప్పట్లో లక్ష్మీనారాయణ ప్రకటించారు.అంతేగాక జనసేన తరపున విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి అధిక ఓట్లు సాధించారు.

టిడిపి కూడా ఆయనకు విశాఖలో సహకరించిందన్న టాక్ ఉంది.అయితే రాష్ట్రంలో జనసేన చాలా ఘోరంగా ఓడిపోయి పవన్ కల్యాణ్ సైతం పరాజయం పాలయిన తర్వాత జేడీ లక్ష్మీనారాయణ కొద్దికాలం ఆ పార్టీ వైఖరిని ఆసెస్ చేసారు.కానీ పవన్ కల్యాణ్ ఫుల్టైమ్ రాజకీయ నాయకుడు కాదని జేడీ ఫీలయ్యారు.పైగా పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల వైపు దృష్టి సారించడాన్ని జేడీ వ్యతిరేకించారు.రెండు పడవల మీద ప్రయాణం సరికాదని పవన్ కల్యాణ్ కు చెప్పేసి లక్ష్మీనారాయణ జనసేన నుంచి బయటకొచ్చేశారు.ఆ తర్వాత ఆయన పెద్దగా వార్తల్లో లేరు గానీ…మళ్లీ ఇప్పుడు రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారన్నారని జేడీ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

పైగా తాను పోటీ చేసి ఓడిపోయిన విశాఖపట్నం ఆయనకు బాగా నచ్చిందని అక్కడినుండే ఎంపీ కావాలని ఆయన డిసైడ్ అయిపోయారని ఆ వర్గాలు చెప్పాయి.ఈ నేపధ్యంలో జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు.రెండు వెయ్యి పధ్నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం లో బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు వైసిపి అభ్యర్థి ,ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ను ఓడించడం తెలిసిందే.పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూడా విశాఖపట్నం జిల్లాలో బిజెపి అభ్యర్థి మాధవ్ జయకేతనం ఎగరవేశారు.మొత్తం మీద చూస్తే విశాఖలో బీజేపీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది.అందువల్ల బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యపడుతుందని జేడీ భావిస్తున్నారట.బీజేపీ కూడా జేడీ పట్ల సానుకూలంగానే ఉందని పైగా ఆయనను పార్టీలో చేర్చుకుంటే బీసీలలో కూడా క్రేజ్ వస్తుందని భావిస్తోందని సమాచారం. బీహార్ ఎన్నికలు పూర్తయ్యాక జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరబోతున్నారని తెలియవస్తోంది.

 

author avatar
Yandamuri

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju