న్యూఢిల్లీ: టిడిపి మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తన మద్దతుదారులతో కలిసి నేడు బిజెపిలో చేరారు. ఆ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్మాధవ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. పివివిపి కృష్ణారావు (అంబిక కృష్ణ) 1999 ఎన్నికల్లో టిడిపి తరపున ఎలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన అప్పటి నుండి టిడిపిలోనే కొనసాగుతూ వచ్చారు. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎపిఎఫ్డిసి చైర్మన్గా అంబిక కృష్ణను నియమితులయ్యారు.