ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్ధిని ప్రకటించిన విపక్షాలు..ఎందుకంటే..?

Share

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్ధిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం జేపి నడ్డా .. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి పేరును ప్రకటించారు. అధికార కూటమి అభ్యర్ధి ప్రకటన వెలువడిన 24 గంటల వ్యవధిలోనే విపక్షాలు సైతం తమ అభ్యర్ధిని ప్రకటించి ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోటీ ఉంటుందని వెల్లడించాయి. విపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరేట్ అల్వాను బరిలో దింపుతున్నట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. 17 పార్టీలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించాయని ఆయన తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు చివరి రోజైన మంగళవారం మర్గరేట్ అల్వా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని శరద్ పవార్ వెల్లడించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఉప రాష్ట్రపతి నియామకం కొరకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 6న ఎన్నిక జరగనుంది.

విపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపిన మార్గరేట్

విపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేయడం పట్ల మార్గరేట్ ఆల్వా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనను ఎంపిక చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. విపక్షాల నిర్ణయాన్ని వినయంతో అంగీకరిస్తున్నట్లు చెప్పారు. తన  పట్ల విశ్వాసం ఉంచిన విపక్షాల నేతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా విపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైన మార్గరేట్ అల్వా సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన మార్గరేట్ అల్వా 1969లో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన ఆమె 1974 లో తొలి సారి రాజ్యసభకు ఎంపికైయ్యారు. ఆ తర్వాత 1980, 1986, 1992 లో వరుసగా రాజ్యసభకు ఎన్నికైయ్యారు.

1999లో ఉత్తర కన్నడ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. 2004 నుండి 2009 వరకూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల గవర్నర్ గా సేవలందించారు. అంతకు ముందు కేంద్ర మంత్రిగానూ పని చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గేందుకు అవసరమైన బలం లేదు అని తెలిసినప్పటికీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా, ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా మార్గరేట్ అల్వాను బరిలోకి దింపాయి విపక్షాలు. అయితే ఇక్కడ కేవలం విపక్షాల ఐక్యతను చాటేందుకే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పెట్టినట్లు కనబడుతోందని రాజకీయ వర్గాల్లో టాక్.

 


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

16 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

25 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago