Amarnath: ఆకుకూరలు మాదిరిగానే అమర్‌నాథ్ కూడా ఒక రకమైన ఆకుకూర మొక్క ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. అమర్‌నాథ్ ఆకులు, మొక్క, గింజలు అన్ని మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అమర్‌నాథ్ మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది.. ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అమర్‌నాథ్ లో విటమిన్ ఎ, బి,సి, డి, ఫొలేట్, నియాసిన్, రైబోఫ్లావిన్ ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో నీ విష వ్యర్థాలను తరిమికొడతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో అధిక కొలెస్టరాల్ ను కరింగించి గుండె ఆరోగ్యం పదిలంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరగాలంటే అమర్‌నాథ్ గింజలు తినాలి. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్స్ ఉండటం వల్ల ఇవి రక్తంలో వెంటనే కరిగిపోవు. అందువల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. మధుమేహులకు ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు.
అమర్‌నాథ్ గింజల్లోని నూనెలు, పైటోస్టెరాల్స్, విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.

ఈ గింజలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంక ఇందులో మాంసకృత్తులు, ఐరన్, మాంగనీస్ భాస్వరం ఉన్నాయి. ఇవి చిన్న పిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహరం. ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్త హీనత నివారణకు చక్కటి ఓషధం. పీచు పధార్ధంఅధికంగా ఉండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది.కడుపునొపి, మూత్రం పోసేటపుడు మంటగా ఉండటం, అతిసారం వంటి ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా గుండెజబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్ళవాతం, రక్తశ్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి ఈ గింజలు తినడం మంచిది.
మార్కెట్లో అన్ని రకాల షాపుల్లో , ఈ కామర్స్ సైట్స్ లో ఈ అమర్‌నాథ్ ఫుడ్స్ లభిస్తాయి. గింజల రూపంలో, పొడి రూపంలో దొరుకుతుంది. ఈ పొడి కొద్దిగా తియ్యగా ఉంటుంది. ఈ పొడిని సూప్స్‌లో కూడా వేసుకోవచ్చు. స్వీట్లలో కూడా వాడుకోవచ్చు. పాలకూర, మిగతా ఆకుకూరలు లాగా అమర్‌నాథ్ మొక్కలను కూడా వండుకొని తినవచ్చు. రోజూ అమర్‌నాథ్ ఆహారం తినమని కొందరు డాక్టర్లు సూచిస్తున్నారు. గంటల తరబడి నీరసం రాకుండా ఉండేందుకు ఈ ఆహారం బాగా ఉపయోగపడుతోంది. అమర్నాథ్ ఆకుకూరలను తరచు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు..