పుష్ప 2 సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ డిస్పషన్లు, ఫైనల్ చేయడం అనేవి పక్కన పెడితే అసలు షూటింగ్ ఏక్కడ చేయాలి? అనేది పెద్ద టాస్క్ గా మారింది. ఆ చిత్ర బృందానికి పుష్ప సినిమా లాగానే పుష్ప 2 కూడా అడవులోనే షూటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ అది ఏ అడవి అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. మొదటి భాగం మారేడుమల్లిలో తీశారు కాబట్టి రెండో భాగం కూడా అక్కడే షూట్ చేయాలా? లేదంటే వేరే లొకేషన్ ఏమైనా దొరుకుతుందా? అని ఆలోచనలు చేస్తున్నారు. పుష్ప తరువాత పుష్ప 2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటంతో ఫారిన్ లొకేషన్స్ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
పుష్ప 2 : ప్లాన్ అదే
ఒకసారి అడవి లొకేషన్ ఫిక్స్ అవుతే వెంటనే పుష్ప 2 షూటింగ్ ప్రారంభించే అవకాశాలు వున్నాయి. లేదా లొకేషన్ ఫైనల్ అయ్యే లోపు సినిమా షూటింగ్‌ని హైదరాబాద్‌లో కొంతవరకు పూర్తి చేసె అవకాశాలు ఉన్నాయి. ముందుగా వేసిన ప్లాన్ ప్రకారం అన్ని నడిస్తే 2023 డిసెంబర్ లేదా 2024 సమ్మర్ హాలిడేస్ లో పుష్ప 2 విడుదల చేసే అవకాశాలు వున్నాయి.
అందుకే కాస్త లేట్
ఒకవైపు డైరెక్టర్ సుకుమార్‌కు, మరోవైపు హీరో అల్లు అర్జున్‌కి, ఇంకోవైపు నిర్మాణం సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ కి కూడా పుష్ప 2 సినిమా అత్యంత ముఖ్యమైంది. అంతేకాకుండా భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా కాబట్టి ఎక్కడ తొందరపడి తప్పటడుగులు వేయకుండా చూసుకోవాలి. అందుకేనేమో ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా, లొకేషన్ పరంగా ఆచి తూచి వ్యవహారిస్తుంది చిత్ర బృందం.