గగనంలో విహారం.. లక్షల్లో వేతనం..! మంచి ఉద్యోగం పొందండిలా..!!

 

విమానయాన రంగం.. శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఒకటి.. ! గత కొంత కాలంగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ సంఖ్య పెరుగుతోంది.. విమానం అనగానే తొలుత గుర్తొచ్చేది పైలట్..! అనడంలో సందేహం లేదు.. ఇది సమాజంలో అత్యంత క్రేజీ కొలువు..! పైలట్ ఉద్యోగం సొంతం చేసుకున్నవారికి .. వేతనం రూ.లక్షకు పైగానే ఉంటుంది..! విమానయాన రంగం.. విస్తృత ఉపాధి వేదికగా మారుతోంది. ఇటీవల కాలంలో నెలకొన్న ఒడిదుడుకులు తాత్కాలికమేనని.. త్వరలోనే ఏవియేషన్ రంగం పుంజుకుంటుందన్నది నిపుణుల అభిప్రాయం! ఈ నేపథ్యంలో విమానయాన రంగంలో ప్లయింగ్, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్) ప్రకటన విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి..

 

AFCAT

ఏఎఫ్‌క్యాట్ ఏటా రెండుసార్లు ఈ ప్రకటన విడుదల చేయడం అభ్యర్థుల పాలిట వరంగా మారింది. ఈ పరీక్షలో మెరిసిన వారికి ఉచితంగా ఫైట్స్ శిక్షణ కాకుండా ఎయిర్ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. అయితే ముందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తారు. టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) అదనంగా రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్ 1,2 పరీక్షలకు ఎంపికచేసి అందులో విజయవంతమైతే , మెడికల్ పరీక్షలు నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు. ఎంపికైన విభాగాన్ని బట్టి ఏడాది నుంచి 18 నెలలు శిక్షణ కొనసాగుతుంది. శిక్షణ సమయంలో రూ.56100 స్టైఫండ్ అందిస్తారు. శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.లక్షకుపైగా వేతనం పొందవచ్చు. ఈ పోస్టులకు మహిళలు కూడా అర్హులే..

 

 

ఉమ్మడి రాతపరీక్షా :
ఈ పరీక్షను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. 300 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీల విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. న్యూమరికల్ ఎబిలిటీ లో పది ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన విభాగాల్లో డిగ్రీ స్థాయిలో ఇస్తారు. అభ్యర్థులకు అవగాహన నిమిత్తం వెబ్సైట్ లో ఉంటాయి. పరీక్షకు ముందు ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ అందుబాటులో ఉంచారు.టేక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) అదనంగా రాయాల్సి ఉంటుంది. ఈకేటీ పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇందులో 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున వీటికి 150 మార్కులు కేటాయిస్తారు.

 

స్టేజ్ 1,2 పరీక్షా విధానం ఇలా ..

ఉమ్మడి రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే స్టేజ్- 1,2 పరీక్షలను నిర్వహిస్తారు. వీటిని ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ నిర్వహిస్తుంది. ముందుగా అభ్యర్థులు 16 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 10 పుష్ అప్స్, 3చిన్న అప్స్ తీయగలగాలి. స్టేజ్ వన్ స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్ఫెక్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ లు ఉంటాయి. చిన్న అసైన్మెంట్లు, పజిల్స్ ద్వారా అభ్యర్థుల మేధస్సును అంచనా వేస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపి దాని పై విశ్లేషణ చేయమంటారు. ఇందులో అర్హత సాధించిన వారికే స్టేజ్-2 కి ఎంపిక చేస్తారు.ఇందులో సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత ఇండోర్, అవుట్డోర్ గ్రూప్ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో మానసిక, శారీరక పనులు నిమిత్తమై ఉంటాయి. చివరిగా ఒక ముఖాముఖీ నిర్వహిస్తారు. ఈ దశలను పూర్తి చేసుకున్నవారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే శిక్షణకు ఎంపిక చేస్తారు.

అర్హతల వివరాలు ఇలా :

ప్లయింగ్, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ :ఈ పోస్టులకు 60%మార్కులతో ఏదైనా డిగ్రీ సరిపోతుంది. ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికెట్ ఉండాలి. వయసు 24 ఏళ్ళు దాటకూడదు. ఎత్తు 162.5 cm ఉండాలి.

టెక్నికల్ :
ఏరోనాటికల్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్, మెకానికల్) వారికీ పోస్టులున్నాయి. 60% మార్కులతో ఇంజినీరింగ్, ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్ 60% మార్కులతో పాసై ఉండాలి.

నాన్ టెక్నికల్ : అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ పోస్టులకు 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. అకౌంట్స్ పోస్టులకు 60% మార్కులతో బికాం చదివిన వారు అర్హులు.

మొత్తం ఖాళీలు: 235
ఎంపికా విధానం : ఉమ్మడి రాత పరీక్ష, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా.
రుసుము : ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ పోస్టులకు రూ.250. మిగిలిన విభాగాలకు ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు ప్రారంభతేది : 01.12.2020.
చివరి తేది: 30.12.2020.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
వెబ్‌సైట్: https://careerindianairforce.cdac.in/