మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మొట్టమొదటి సినిమా ఉప్పెన.. ఈ మూవీకి బుజ్జిబాబు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సుమారు 18 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఉప్పెన చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ కు జోడీగా కన్నడ కుట్టి కృతి శెట్టి నటించింది. తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రత్యేక రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పెండింగ్ లో పడింది. ఓటిటి ద్వారా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చినా…వైష్ణవ్ తేజ్ ఫస్ట్ సినిమా కావడంతో థియేటర్లోనే ప్రదర్శించాలని అనుకుంటున్నారు సినిమా యూనిట్ సభ్యులు.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ కు ఈ సినిమా మంచి హిట్ అందుకొని కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలవాలన్న ఉద్దేశంతోనే నష్టాలు వచ్చినా..వాటిని తట్టుకుంటూ రిలీజ్‌ను పెండింగ్ లో ఉంచుతున్నారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా విడుదలైన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.
సిద్ శ్రీరాం పాడిన పాటకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఈ సాంగ్స్ ను చూసి..సినిమా కథను కాస్త తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రేక్షకులు. పాత సినిమాల్లో లాగానే హీరో పేదవాడు, హీరోయిన్ మంచి కుటుంబంకు చెందిన అమ్మాయి. ఇందులో తన కూతురిని ఓ పేదింటి కుర్రాడు ప్రేమించడం ఇష్టం లేని తండ్రి హీరో కుటుంబానికి నష్టం చేస్తాడు.
సినిమాలో ఇదే ప్రధాన అంశం. కాస్త అటు ఇటుగా సన్నివేశాలు ఉన్నా పాత కాలంలో చిరంజీవి నటించిన సినిమాల లాగా ఉన్నాయంటూ టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కొంత మంది డైరెక్టర్లు, నిర్మాతలు ఉప్పెన కథను విని ఎగ్జైట్ అయ్యారని టాక్. అయితే ఈ పాత కథతో వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ సాంగ్స్ పరంగా సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక తెరమీదకు వచ్చాక బంపర్ హిట్ అయితే వైష్ణవ్ తేజ్ కు మంచి గుర్తింపు లభిస్తుందని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట. అంతేకాదు ఏ కథ కొత్తది కాదని కథనం మాత్రమే కొత్తగా ఉంటుందని ఖచ్చితంగా ఉప్పెన బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని మాట్లాడుకుంటున్నారట. చూడాలి మరి ఉప్పెన వైష్ణవ్ తేజ్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తుందో.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!