User Charges In AP: ఏపీలో “చెత్త “దుమారం! కరోనా కల్లోలంలో పట్టణ ప్రజలపై అదనపు ఆర్థిక భారం!!

Share

User Charges In AP:  కరోనా కల్లోల సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య నిర్వహణ పేరుతో ప్రజల నుండి ముక్కు పిండి యూజర్ చార్జీలు వసూలు చేయబోతుండటం పై నిరసన వెల్లువెత్తుతోంది.ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం 2016 లో పారిశుధ్య నిర్వహణ చట్టం రూపొందించి అందులో యూజర్ చార్జీల వసూలు ప్రతిపాదనలు పొందుపర్చగా ఐదేళ్ల తర్వాత జగన్ ప్రభుత్వం ఈ చట్టం అమలుకు చర్యలు చేపట్టింది.దాన్నే ఇప్పుడు కరోనా సమయంలో చడీచప్పుడు లేకుండా అమలు చేస్తున్నారు.

extra financial burden on urban people in corona upheaval
extra financial burden on urban people in corona upheaval

User Charges In AP: ప్రజలపై అదనపు ఆర్థిక భారం !

రాష్ట్రంలోని పురపాలక సంఘాలలో పారిశుధ్య నిర్వహణ కోసం క్లీన్ ఆంధ్రప్రదేశ్ ( క్లాప్ )అనే పథకాన్ని రూపొందించినట్లు తెలియజేస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన 4329936 నెంబర్ మెమో జారీ చేసింది.ఈ పథక నిర్వహణకు ప్రజలనుండి నెలనెలా యూజర్ చార్జీలు వసూలు చేయాలని అందులో పేర్కొంది. ఆ యూజర్ చార్జీలను ప్రభుత్వమే నిర్ణయించి మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు పంపింది.వీటికి ఆయా మున్సిపల్ కౌన్సిళ్ల ఆమోదం తీసుకొని అమలు చేయాలని ఆదేశించింది.మున్సిపాలిటీ గ్రేడ్లను బట్టి యూజర్ చార్జీలు ఉంటాయి. పట్టణాల్లోని ప్రతి ఇంటి యజమాని పైన కనీసం 100 రూపాయల అదనపు ఆర్ధిక భారం పడే విధంగా ఈ ఛార్జీలు ఉన్నాయి.అంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు పైమాటే.ఇంకా చెప్పాలంటే కొన్ని ఇళ్లకు ఉన్న ఇంటి పన్ను కంటే ఈ యూజర్చార్జీలే అధికంగా ఉండబోతున్నాయి.

ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే!

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీలోని అన్ని మున్సిపాలిటీలు ,కార్పొరేషన్లలో ఈ ప్రతిపాదనలకు ఆయా మున్సిపల్ కౌన్సిళ్ల ఆమోదం తీసుకునే ప్రక్రియ మొదలైంది.ఈ నెల నుండే ఈ యూజర్ చార్జీలు వసూలు కావాలన్న ఆదేశం ఉండటంతో మే నెలాఖరులో జరిగిన కౌన్సిల్ సమావేశాలలో అన్ని చోట్లా ఈ అంశాన్ని అజెండాలో పెట్టారు.అయితే ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశముండటంతో చాలాచోట్ల మున్సిపల్ కౌన్సిళ్లు ఇందుకు వ్యతిరేకత తెలిపాయి.ఈ ప్రతిపాదనల ఆమోదానికి జంకాయి.రాష్ట్రమంతా వైసిపి మున్సిపల్ చైర్మన్లు, ఆ పార్టీ కౌన్సిలర్లే ఉన్నప్పటికీ ఈ నిర్ణయం అమలు చేస్తే ప్రజావ్యతిరేకత రాగలదని వారు భయపడుతున్నారు. అందువల్ల కొన్ని మున్సిపాలిటీలు ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేశాయి.

Read More: Jagga Reddy: కరోనా వేళ తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక నిర్ణయం..!!

మంత్రి బొత్స నేరుగా లైనులోకి వస్తున్నారా?

ఇలా వాయిదా నిర్ణయం తీసుకున్న మున్సిపల్ కమిషనర్ లకు నేరుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్ చేసి తక్షణమే యూజర్ చార్జీల వసూళ్లకు ఆమోదం తెలపాలని ఆదేశిస్తున్నారట.ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్ ఏసయ్య ఈ విషయాన్ని కౌన్సిల్ సమావేశంలో తెలిపారు.యూజర్ చార్జీల వసూలు నిర్ణయాన్ని చీరాల మున్సిపల్ కౌన్సిల్ వాయిదా వేయగా తనకు నేరుగా మంత్రి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ యూజర్ చార్జీలు వసూలు కు ఆమోదం తెలపాల్సిందేనని ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.ఆ మేరకు చీరాల మున్సిపల్ కౌన్సిల్ బుధవారం ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.ఏదేమైనప్పటికీ యూజర్ చార్జీల వసూళ్లు వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదిగా ఉందని వైసిపి ప్రజాప్రతినిధులే వాపోతున్నారు.ఒకవేళ నిర్ణయాన్ని అమలు చేయాలనుకున్న ఇది సరైన సమయం కాదన్నది వారి వాదన.కానీ సీఎం జగన్ కి చెప్పేవారెవరు?

 


Share

Related posts

సైకిల్ దిగిన మాజీ మంత్రి ఖలీల్

somaraju sharma

జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు..! అది ఏమిటంటే..!!

somaraju sharma

అయోధ్య భూమిపూజ‌లో పాల్గొనే అర్చ‌కుడికి క‌రోనా.. మ‌రో 16 మంది పోలీసుల‌కు కూడా..!

Srikanth A