Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినదేమీ లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఆమె ఒక సెలబ్రిటీ. జబర్దస్త్ షోలో ఎప్పుడైతే అడుగు పెట్టిందో.. పెద్ద సెలబ్రిటీ అయింది. నిజానికి.. జబర్దస్త్ షో ద్వారా చాలా మంది కమెడియన్లు బయటికి వచ్చారు. చాలామందికి గుర్తింపు వచ్చింది. కానీ.. వాళ్లంతా జెంట్స్. కానీ.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చి.. సెలబ్రిటీ అయిన మొదటి యువతి వర్ష. అవును.. తనకు ప్రస్తుతం సినిమాలు, షోలు, ఇతర ప్రోగ్రామ్స్ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

కానీ.. తనకు లైఫ్ ఇచ్చిన షో జబర్దస్త్ ను మాత్రం వర్ష వదలడం లేదు. జబర్దస్త్ ను, ఇమ్మాన్యుయేల్ ను నా లైఫ్ లో మరిచిపోను.. అని వర్ష జబర్దస్త్ స్టేజ్ మీదనే చాలాసార్లు చెప్పింది.
అంటే.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో వర్ష ఇక సెట్ అయిపోయినట్టే. ప్రస్తుతానికి కెవ్వు కార్తీక్ టీమ్ లో వర్ష, ఇమ్మాన్యుయేల్ చేస్తున్నప్పటికీ.. త్వరలోనే ఇమ్మాన్యుయేల్ ను టీమ్ లీడర్ ను చేసే యోచనలో మల్లెమాల యాజమాన్యం ఉందట. ఒకవేళ ఇమ్మాన్యుయేల్ ను టీమ్ లీడర్ ను చేస్తే.. ఇక వర్షతో కలిసి స్కిట్ చేస్తాడు ఇమ్మాన్యుయేల్.
Jabardasth Varsha : అందాలు ఆరబోయడానికి కూడా రెడీ అంటున్న వర్ష
అయితే.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో అందాలు ఆరబోయడానికి కూడా వర్ష వెనకాడటం లేదు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని, రకరకాల కాస్టూమ్స్ తో అదరగొడుతోంది. మొత్తానికి వర్ష ఇక జబర్దస్త్ లో ఫిక్స్ అయిపోయినట్టే. ఆన్ స్క్రీన్ మీద ఇమ్మాన్యుయేల్, వర్ష కెమిస్ట్రీ పండినంతగా.. ఎవ్వరిదీ పండదు. అది మరి వర్ష అంటే. మొత్తానికి నక్క తోక తొక్కి వచ్చినట్టుంది వర్ష. పోయి పోయి జబర్దస్త్ లో పడింది. లైఫ్ సెటిల్ చేసేసుకుంది. ఇంత అదృష్టం ఎంత మందికి ఉంటుంది చెప్పండి.
మొత్తానికి ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. వెంటనే చూసేయండి.